రాష్ట్రీయం

సమ్మక్క-సారక్క జాతరకు రూ.101 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబింపచేసే సమ్మక్క, సారక్క జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ జాతర ఏర్పాట్ల నిమిత్తం రూ.101 కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రులు ఇంధ్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాలపై ఈ ఇద్దరు మంత్రులు శుక్రవారం సచివాలయంలో సమ్మక్క, సారక్క జాతర ఏర్పాట్లను సమీక్షించారు. అత్యవసర సేవలైన అగ్నిమాపక, వైద్యారోగ్య పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు అధికారులకు స్పష్టం చేశారు. తాగునీటి, పార్కింగ్, స్నానఘట్టాల విషయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆసియాలో అతి పెద్ద జాతరైన సమ్మక్క, సారక్క జాతరకు విస్తృత స్ధాయిలో ప్రచారం కల్పించాలని సమాచార శాఖను ఆదేశించారు. జాతరకు నెలన్నర సమయం మాత్రమే ఉండడంతో సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి మొదటి వారంలో క్షేత్ర స్ధాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. తెలంగాణ ఆవిర్భవించాక తొలి జాతర కావడంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దీని నిర్వహిస్తున్నట్లు మంత్రి చందులాల్ చెప్పారు. జాతర విజయవంతమయ్యేందుకు అన్ని వాఖలు సహకరించాలన్నారు.