జాతీయ వార్తలు

రోహ్‌తక్‌లో సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:హర్యానాలో జాట్ ఆందోళన హింసాత్మకంగా మారడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముఖ్యంగా రోహ్‌తక్, భివాని, హిసార్, సోనెపట్, జజ్జర్ ప్రాంతాల్లో సైన్యాన్ని రప్పించారు. ఒబిసి కోటాలో చేర్చడం లేదా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన చేపట్టిన జాట్‌లు శుక్రవారం రాష్ట్ర ఆర్థికమంత్రి ఇంటిపై దాడికి పాల్పడి వాహనాలకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా అటు ఆందోళనకు దిగిన సంఘాల నాయకులు, ఇటు విపక్ష నేతలతో ముఖ్యమంత్రి ఖట్టర్ జరిపిన చర్చలు ఫలించలేదు. కాగా వందలాది మంది ఆందోళకారులు పోలీసు వాహనాలకూ నిప్పుపెట్టారు. రహదారులు, రైలుమార్గాలపై బైఠాయించి రాకపోకలకు ఆటంకం కల్పించారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 500 రైళ్ల రాకపోకలపై దీని ప్రభావం పడింది.