జాతీయ వార్తలు

ప్రజల భాగస్వామ్యం అదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలైన అభివృద్ధికి నిదర్శనం
మోదీ విధానాలను కొనియాడిన జావడేకర్
బోర్పని (మధ్యప్రదేశ్), డిసెంబర్ 24: గత యుపిఏ ప్రభుత్వం ప్రజలకు ‘్భృతి చెల్లించే’ దృక్పథం గల విధానాలను అనుసరించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ధ్వజమెత్తారు. అందుకు భిన్నంగా ఎన్‌డిఏ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నిజమైన మార్పును తీసుకువచ్చే అభివృద్ధి నమూనాను ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తోందని అన్నారు. ‘ప్రజలు ఏమీ చేయకుండా ప్రతిదానికి ప్రభుత్వంపై ఆధారపడే ఆలోచనా విధానం గల విధానాలను గత ప్రభుత్వం అనుసరించింది. ప్రతి అయిదేళ్లకోసారి ప్రజలంతా ఓట్లేస్తే సరిపోతుంది అనే వైఖరిని ప్రోత్సహించింది. ఈ వైఖరి వల్ల క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు’ అని గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ జావడేకర్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా వారికి సాధికారతను కల్పించే విధానాలను అనుసరిస్తోందని వివరించారు. పల్లెసీమలు అభివృద్ధి చెందడం ఎంతో ముఖ్యమని ఈ ప్రభుత్వం విశ్వసిస్తోందని, అందుకోసం మరింత ముందుకు సాగేందుకు సర్కారు సన్నద్ధంగా ఉందని తెలిపారు. అయితే ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. తన మంత్రిత్వ శాఖ కూడా అడవులను అభివృద్ధి చేయడానికి, సంరక్షించడానికి ప్రజలను భాగస్వాములను చేసే విధానాలను అనుసరిస్తోందని మంత్రి వివరించారు. గిరిజన కుటుంబాలు అడవుల్లో వెదురు మొక్కలను నాటి, వాటి ఉత్పత్తులనుంచి ఆదాయాన్ని పొందేందుకు వీలు కల్పించే యుఎన్‌డిపి మద్దతు పథకం వల్ల వచ్చిన ఫలితాలు ప్రభుత్వానికి ప్రోత్సాహన్నిచ్చాయని మంత్రి చెప్పారు. వెదురు మొక్కలను నాటిన గిరిజన కుటుంబాలలో కొన్ని గత సంవత్సరం రూ.17వేల వరకు సంపాదించాయని మంత్రి వెల్లడించారు.