జాతీయ వార్తలు

జవాన్ రవీందర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సోషల్‌మీడియాలో పరిచయం అయిన పాకిస్థాన్ యువతితో చాటింగ్, వీడియో కాలింగ్ చేసి మాట్లాతుండే రవీందర్ కుమార్ అనే జవాన్‌ను అరెస్టు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలపైన, ఆయుధాలకు సంబంధించిన విషయాలు మాట్లాడటమే కాకుడా ఆయుధాల ఫొటోలు తీసి పంపినట్లు గుర్తించారు. దీంతో అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. హర్యానాకు చెందిన మహేందర్‌గఢ్‌ జిల్లాకు చెందిన రవీందర్‌ కుమార్‌ 2017లో సైన్యంలో చేరారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తుండగా.. ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో తరచూ ఛాటింగ్‌, వీడియో కాలింగ్‌ చేసే రవీందర్ సైన్యానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు గానూ యువతి నుంచి రవీందర్‌ డబ్బులు కూడా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.