గుండెపోటుతో దర్శకురాలు జయ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలుగు సినీ దర్శకురాలు, డైనమిక్‌ లేడీ బి.జయ(54) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాత్రికేయురాలిగా ప్రస్థానాన్ని ఆరంభించిన జయ చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ’వైశాఖం’చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతోపాటు సిల్వర్‌ క్రౌన్‌ అవార్డ్‌ను అందుకున్నారు.