తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

వలసవాదం నుండి విముక్తి వాదం దిశగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రణాళిక రచించు. లేదా రచించబడిన ప్రణాళికలో భాగమైపో. ఇదీ వర్తమాన రాజకీయ నీతి. దీనినే చాణక్యుడు షడ్యంత్రం అంటాడు.
జాతికి గల స్వేచ్ఛ వేరు. దేశ స్వేచ్ఛ వేరు. ప్రజల స్వేచ్ఛ వేరు. అప్పుడప్పుడు జాతి, దేశం కలగలిసిపోతుంది. దానినే కొంతమంది దేశీయత, జాతీయత అని అంటారు. దేశాలకు స్వేచ్ఛ ఏ ప్రాతిపదికన ఉంటుందనేది ఆయా స్థల కాలాలను బట్టి ఉంటుంది.
వర్తమానంలో దేశాల స్వేచ్ఛ గురించి ఓసారి అవలోకించుకోవడం పౌరుల బాధ్యత. వ్యక్తుల స్వేచ్ఛ ముఖ్యమే అయినా, అప్పుడప్పుడు దేశ సార్వభౌమిక స్వేచ్ఛ కూడా ముఖ్యమే. సైనిక పాలన, మతపాలన, నియంతృత్వ పాలన, ప్రజాస్వామ్య పాలన అని రకరకాలుగా దేశాలు పాలింపబడతాయి. ఈ పాలనా స్వభావాన్ని బట్టి ప్రజల స్వేచ్ఛ నిర్ణయించబడి ఉంటుంది.
మనిషికి రాజ్యాంగపరమైన హక్కులు కొన్ని ఉంటాయి. స్వేచ్ఛా జీవనం రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని కాపాడడానికి న్యాయ, పోలీసు వ్యవస్థల వంటి వాటిని ఏర్పరుస్తారు. వీటికి భిన్నంగా అప్పుడప్పుడు మత వ్యవస్థ అంతర్గతంగాను, బహిరంగంగాను ప్రభావితం చేస్తుంది. మనిషి ఏర్పాటు చేసుకున్న మత వ్యవస్థ రానురాను, దానికి అదే శృంఖలమై అందులో చిక్కిపోతాడు మనిషి. ఏ వ్యవస్థనైనా ప్రశ్నించవచ్చు. కానీ దీనిని ప్రశ్నించడంతో మానవ స్వేచ్ఛ చివరి మెట్టు చేరుతుంది.
ఇప్పుడు మత దేశాలు, మత విద్వేశాలు ఉన్నాయి. ప్రజాస్వామిక దేశాలు ఉన్నాయి. నియంతృత్వ పోకడలతో పాలింపబడే దేశాలూ ఉన్నాయి. వీటి అన్నింటిని మించి బలీయమైన ప్రణాళికాబద్ధ రచన ఒకటి ఉంది. చాలా దేశాలు అందులో భాగమైపోతున్నాయి. భాగం కానివి దానిని ఎదిరించడం కోసం మతం వంటి ముసుగులు వేసుకుంటాయి. పైకి కనిపించే మతం ఒక బహానా. మతం పేరుతో జన బాహుళ్యాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురావడమే ప్రధానం. ఇది సులభం. అందుకే 3రాజ్యం2 తన రాజ్యాంగంతో పనిచేయించలేక రాజకీయ పీఠం మతాన్ని రంగంలోకి దింపుతుంది. ముస్లిం దేశాలలో ఈ పరిస్థితిని ప్రత్యక్షంగాను, మరికొన్ని దేశాలలో అప్రత్యక్షంగాను చూడవచ్చు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వలస పాలకులనుండి స్వాతంత్య్రం పొందిన చాలా దేశాల ‘స్వతంత్రత’2ఏపాటిదో ఆలోచించాల్సిన సమ యం వచ్చింది. భారతదేశం 3రెండు వలసలతో2 నిండిన నేల. ముస్లిం రాజుల ఆక్రమణతో ఇస్లాం మొదటి వలస ప్రారంభం. అది భౌతిక వలసగా చాలాకాలం రాజ్యమేలింది. బ్రిటిష్ (క్రైస్తవ) వలస మాత్రం మన మనసులలోకి ఎక్కిపోయింది. దీనితో భౌతిక పరంగా, భావనాపరంగా వలస జీవులమయ్యాం. మొదటి దానికన్నా రెండోది చాలా ప్రమాదకారి అయి కూచుంది. ఎందుకంటే కొంత సమయం అది విరామం తీసుకున్నట్టు కనుపించినా 1990 దశకంనుండి మరింత శక్తిమంతంగా ప్రభావితం చూపడం మొదలుపెట్టింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ భారత భూభాగాన్ని తమ అధీనంలో పెట్టుకుని పరిపాలించాలని చూసిన దాఖలాలు తక్కువ. వ్యాపారం చేసి డబ్బు గడించాలన్నది వారి చెరగని అభిమతం. వీరు ముస్లిం రాజుల వలె దాడి చేసి నయనా భయాన కుట్రలు కుహనాలతో దేశీయ రాజ్యాలను ఆక్రమించాలని అనుకోలేదు. కాని ఆంగ్లేయులు మాత్రం లోగడ ఎన్నడు లేని విధంగా భౌతికంగా, సాంస్కృతికంగా భారతీయులను లోబరుచుకున్నారు.
విభిన్న సంస్కృతులు, వివిధ రాజరికాల పాలన, మతం, సంస్కృతి, నాగరికత, చరిత్ర వంటి పలు రీతులలో సాగిన పాలనలో లోగడనుండి ఉన్న వైరుధ్యాలు ఆంగ్లేయ పాలకులకి కలసివచ్చింది. సాంస్కృతిక విలక్షణతలు, విభిన్నతలను, కొన్నిసార్లు పాలకులు వైరుధ్యాలుగా చిత్రీకరించారు. అందువల్ల వలసవాద సంస్కృతి చొరబాటు సులభతరమైంది. మానవ జ్ఞాన సంచితమైన భిన్నత్వం, బహుళత్వం భారతదేశానికి శాపంగా పరిణమించింది. ప్రజల సంస్కృతిలోకి రాజకీయ/పాలకవర్గ సంస్కృతి ఇంకిపోవడం మొదలైంది. ఒకవైపు ఆధునిక(?) వలసవాద వస్తధ్రారణ, భాష, పానీయ సేవనం వంటివి మధ్యతరగతి దాకా సులభంగా చొచ్చుకు వచ్చాయి. మొదటిసారిగా ఒక సాధారణ సంస్కృతి అన్ని ప్రాంతాలలో పాటింపబడింది.
క్రైస్తవమతం ఆధునికమైందని భావిస్తాం. అభ్యుదయకరమైందని విశ్వసిస్తాం. ఇస్లాం అనాగరికమైనదని, వీరిచే చెప్పబడింది. పుస్తకాలలో రాయబడింది. హిందుమతం కొంతమందికే పరిమితమైందని చెప్పడం మొదలు కాగానే ఈస్టిండియా కంపెనీ కాలపు మిషనరీలు, బ్రిటిష్ మత ప్రచారకులు రంగప్రవేశం చేసి మొదట చర్చిలు నిర్మించడం ప్రారంభించారు. అచ్చయిన బైబిల్ మత గ్రంథం ప్రతులు ఊరూరా పంపంకం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలకుల, మత ప్రచారకుల ప్రభావం బ్రాహ్మణ వర్గాలపై పడింది. వారి కింద ఉద్యోగాలే కాదు, తమ ప్రాబల్యం పెంచుకనే దిశగా అడుగులు వేశారు. సాంప్రదాయక చట్రం నిబంధనల సడలింపు జరిగింది. మరికొన్ని చోట్ల కట్టుదిట్టంగా మారింది. అప్పుడు విదేశీ మత ప్రభావం దూకుడు తగ్గింది. కింది వర్గాలలో వారి మత ప్రచార కార్యక్రమాన్ని ఆపకుండా తమ పని తాము కానిచ్చుకున్నారు. ఈ వర్గాలని ఆధునిక భావజాల దృక్పథాల విస్తరణ దిశగా ఆలోచించేలా చేశారు బ్రిటిష్ పాలకులు. స్ర్తి పురుష భేదాలు తగ్గించేలా, సామూహిక కలయికలు జరిగేలా, సమాజంలో ఉన్న ఛాందస భావాలను దూరం చేసే ఆలోచనలు కొన్ని అందించారు. ఉన్నతవర్గం, మధ్యతరగతి ఆలోచనను సంస్కరణలుగా భావించారు. తమని తాము సంస్కరించుకునే క్రమంలో వలసవాదాన్ని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. తమ మనశ్శరీరాలను ఏకం చేసి మానసికంగా వలసీకరణ చెందారు. అది మనోధర్మంగా మారే క్రమానికి దగ్గరయ్యారు. లోగడ ముస్లిం రాజుల కాలంలోనుండి వస్తున్న ఈ నమూనాలో కొత్తగా చేరిపోయి మనసా వాచా కర్మణా వలస స్వభావాన్ని వంటబట్టించుకున్నారు. ప్రవాస జీవితంలో గడిపినట్టుగా ఒక కొత్త జీవన విధానంలోకి తర్జుమా కావడం జరిగింది. అదే మెల్లిమెల్లిగా పరారుూకరణలోకి దారి తీసింది. తనని తాను విస్మృతికి గురి చేసుకుని, లేని దానిని సొంతం చేసుకోవడమే వలస భావనలోకి దిగబడడం. సాంస్కృతికంగా మనసుని పరాయత్తం చేసుకున్న వారు చాలామంది ఆధునికులుగా పేరు పొందారు. వీరిని కీర్తించడం కూడా వలసభావ ప్రభావంగానే గుర్తించాలి. ఈ మేధో వలస క్రమం అన్ని రంగాలలోకి పాకిపోయింది. ఇంకా ఇంకా అది లోతుగా పాతుకుపోతోంది. అంటే దేశీయ సాంస్కృతిక భావనని, వాస్తవ ప్రజాస్వామిక లక్షణాలను పక్కనపెట్టి కొత్త పాలకవర్గం ప్రవేశపెట్టిన విషయాలను క్రమంగా కొనసాగించడం, ఆచరించడం జరిగింది. అది చాలామంది భారతీయ మేధావి వర్గాన్ని ప్రలోభపెట్టింది. దాని వల్ల భారతదేశంలో అనాదిగా పాటింపబడుతూ వచ్చిన స్ర్తి, పురుష సమత్వం, పేద, ధనిక తారతమ్య రాహిత్యం, అందరూ కలిసిమెలసి జరుపుకునే జాతరలు, పండగలను విస్మరించడం జరిగింది. దేశీయ సంస్కృతి పనికిరానిదైంది. విదేశీ వలస సంస్కృతి పూజనీయమైంది.
ఆక్రమణవాదులు, చొరబాటుదారులు మనకు ఆదరణీయులయ్యారు. భౌతికంగా దేశాన్ని ఆక్రమించే వారికన్నా వలసభావన పునాదిపై నిశ్శబ్దంగా ఆక్రమించే వారే ప్రమాదకారులు అని తెలిసి కూడా ఆపలేకపోవడం ఒక విషాదం. అంతర్గతంగా పోరాడి, తంటాలు పడి అధికార పీఠం ఎక్కిన పాలకులు ఎవరైతేనేం అందరు ఒకేలా కనుపిస్తున్నారు. ఒకేలా మాట్లాడుతున్నారు. ఒకే 3్భష2 వినిపిస్తున్నారు. ఇది విచిత్రం. రచింపబడిన అగ్రదేశాల పథకంలో, పన్నాగంలో ఇరుక్కుపోయి గిలగిలలాడుతున్నారు.
చెప్పింది ఒకటి. ఇప్పుడు చెబుతున్నది మరొకటి. చేసేది మాత్రం పూర్తి వ్యతిరేకం. పాత పాలకులు పరిచిన ఎర్రతివాసీపైనే నడకలు. నడతలు. వస్త్రాలంకరణలు. కొత్త తివాచీలు పరిచి పరిచి భుజాలు పులిసిపోయినా ఏదో ఆశ. తివాచీలపై నుండే అభివృద్ధి నడిచొస్తుందని ఆరాటం. వేసిన దుస్తులు వేయకుండా, ఎక్కిన విమానం, దిగిన విమానం ఎక్కకుండా ప్రపంచ దేశాల పర్యటనలు. అన్ని దేశాలలో పలికిన పలుకుల్లో తొంగి చూసే ఆలోచన ఒకటే. మా దేశం రండి. పెట్టుబడులు తెండి. తివాచీలు సిద్ధం. జీ హుకుం. ఆజ్ఞాపించండి. అమలు చేసే బాధ్యత మాది. ఇదీ పరిపాలన నమూనా అన్నిచోట్ల.
ప్రణాళిక పంపండి. అమలుపరచడం తరువాయి. కొత్త రాజధానిలో అదే పాత వరస. పాత రాజధానిలో అదే కొత్త వరస.
అడవిలో నీతి ఏమంటే జీవాలను ఆహారం చేసుకో. లేదా ఆహారంగా మారు. మనం ఇప్పుడు అలాంటి ఒకానొక స్థితిలో ఉన్నామా?
పాలించు. లేదా పాలింపబడు. అనేది అగ్ర రాజ్యాల ఆదేశం. మొదటిది కష్టం. రెండోది సులభం. ఈ నమూనా మనకి వలసవాదం నుండి సంక్రమించిన వారసత్వం. దాన్నుండి బయటపడడం అంత సులభం కాదు.సరళీకరణ, ప్రపంచీకరణ ఏనాటినుండో మనం సంస్కృతిగా మార్చుకున్నాం. ఆ ప్రభావంనుండి అంత త్వరగా మనం దూరం కావడం సాధ్యమా? దేశానికి స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం ఏ మేర అవసరం అని ఆలోచిస్తే మన ముందున్న మార్గం ఏదన్నది తేటతెల్లం అవుతుంది.
కొత్త ప్రణాళిక రచిద్దామా
రచింపబడిన విదేశీ ప్రణాళికలో భాగమైపోదామా.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242