జయహో

జయెహో....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓటమి ముగింపు కాదు..
ప్రయత్న విరమణే ముగింపు’

క్రికెట్.. పరిచయం అక్కర్లేని క్రీడ. అలాంటి క్రికెట్ క్రీడాకారుల్లో ‘అనిల్ కుంబ్లే’ గురించి తెలియని వారుండరు. భారతదేశపు అత్యున్నత స్పిన్ బౌలర్ అంటే ఠపీమని గుర్తొచ్చేది ఆయన పేరే. అయితే అనిల్ కుంబ్లే క్రికెట్ జీవితం అంత సాఫీగా కొనసాగిందనుకుంటే పొరపాటే. అతను తన క్రికెట్ కెరీర్‌లో ఎన్ని ఘన విజయాలను సొంతం చేసుకున్నాడో అన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు. అకారణంగా ఎదురుదెబ్బలు తిన్నాడు.
అతని క్రికెట్ రంగప్రవేశమే విమర్శలతో మొదలైంది. సోడాబుడ్డి కళ్లద్దాలతో, బక్కపలుచగా ఉన్న ఇతనా బౌలింగ్ చేసేది అని కొందరు, ఇతను మాకు లెగ్‌స్పిన్నర్‌లా కాదు మీడియం పేస్ బౌలర్‌లా కనిపిస్తున్నాడని కొందరు, మరి కొందరైతే ఇతను స్పిన్నరే కాదని, స్పిన్నర్లకు ఆయువు పట్టైన బంతిని గిరిగిట్లు తిప్పడం చేతకాదని కొందరు విమర్శించారు.
ఇలా ఆదిలోనే గునపాల్లా గుండెల్లో గుచ్చుకునే మాటలతో, ప్రోత్సహించాల్సింది పోయి ఘోరాతి ఘోరంగా నిరుత్సాహపరిచారు. కేవలం వీరి మాటలే కాదు.. భ్రష్టు రాజకీయాలకు, దరిద్రపుగొట్టు రికమండేషన్లకు పేరైన భారత క్రికెట్ బోర్డు కూడా ఇతని క్రికెట్ కెరీర్‌తో ఆడుకుంది.
అకారణంగా అతడిని జట్టులోంచి తొలగించడం, వనే్డలకు అతడిని దూరంగా ఉంచడం, ఎప్పుడు పడితే అప్పుడు టీంలోకి తీసుకోవడం, జట్టులో సీనియర్ ఆటగాడైనా తుది 11 మంది జట్టులోకి ఎంపిక చేయకపోవడం, వైస్ కెప్టెన్ స్థాయి నుంచి కెప్టెన్ స్థాయి ఇవ్వాల్సింది పోయి, వైస్ కెప్టెన్సీతోపాటు జట్టు నుంచి తొలగించడం ఇలా ఒకటా రెండా అన్నీ అవమానాలే.
చివరకు ప్రభుత్వాలు కూడా.. ఒంటి చేత్తో లెక్కకు మించి జట్టుకు ఘన విజయాలను అందించినా, ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు సాధించి ప్రపంచ రికార్డును సమం చేసినా అతని ప్రతిభకు సరితూగే పురస్కారాలు అతనికి దరి చేరనేలేదు. మొన్నటికి మొన్న వచ్చిన వారికి ‘పద్మ’ పురస్కారాలు అందించిన ప్రభుత్వాలు జాతి గర్వపడే విజయాలందించిన వ్యక్తికి మాత్రం ఎప్పటికీ ఇవ్వలేదు.
ఘన విజయాల నందించినా జట్టులో ఎప్పుడు ఉంటాడో తెలియని పరిస్థితి. ఆపత్కాలాలలో అండగా నిలిచే రాజకీయ పెద్దలు, బోర్డు సభ్యులు లేకపోవడం, నిత్యం విమర్శలు.. ఇవన్నీ తన ఎదుగుదలకు సోపానాలుగానే భావించారీయన. ఏనాడు ఎవ్వరినీ ఒక్కమాట అనలేదు. ఎందుకు జట్టులోకి తీసుకోలేదని ప్రశ్నించనూ లేదు. కెప్టెన్సీ రాలేదని కుమిలిపోలేదు.
అన్నింటికీ ఒక్కటే సమాధానం. తన చేతి ఆయుధమైన బంతితో విజృంభించటం. విమర్శలకు తన ఆట తీరుతో చెంప ఛెళ్లుమనే సమాధానాలివ్వటం. అతన్ని ఎంత అణగదొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదిగాడు.
ఆపత్కాలంలో గుండెనిబ్బరం కోల్పోకుండా, అధైర్యపడకుండా, ఎప్పటికప్పుడు విమర్శలను విజయానికి బాటలుగా మార్చుకొంటూ, తన బౌలింగ్‌కు పదును పెడుతూ, ఆటలో మరింత రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏ కెప్టెన్ అయినా సరే జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే బంతిని ‘కుంబ్లే’ చేతికిస్తే చాలనే రీతిలో రాణించాడు. వనే్డల్లో, టెస్టుల్లో అధిక వికెట్లు సాధించిన భారతీయుడయ్యాడు. అదీ, అనిల్‌కుంబ్లే ప్రత్యేకత.
విజేతల పయనమే ఇది.

--శృంగవరపు రచన 99591 81330