జాతీయ వార్తలు

గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన సమయంలో వెల్లడిస్తాం: జయలలిత

చెన్నై, డిసెంబర్ 31: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సరైన సమయంలోనే తమ వ్యూహాన్ని ప్రకటిస్తామని అధికార అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత వెల్లడించారు. కొత్త సంవత్సరంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మళ్లీ గెలవడమే లక్ష్యంగా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతామని తెలిపారు. అయితే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివిధ పార్టీలతో పొత్తులు సహా అన్ని అంశాలను సాకల్యంగా పరిశీలించి సరైన సమయంలోనే పరిశీలిస్తామని చెప్పారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని పార్టీలతో పొత్తుపెట్టుకున్నామని అలాగే 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరికొన్ని పార్టీలకు చేరువయ్యామని గురువారం పార్టీ కార్యనిర్వాహక సాధారణ మండలి సమావేశంలో జయ గుర్తుచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులేకుండా పోటీ చేశామని ఆ విధంగా 37 మంది ఎంపీలను గెలిపించుకుని ప్రస్తుత లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించామని ఆమె స్పష్టం చేశారు. ఇదే రకమైన వ్యూహాత్మక స్పూర్తితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు డిఎంకె ప్రజలను దగా చేసిందని, విద్యుత్ కోతలతో జనజీవనాన్ని కకావికలం చేసిందని జయ ఆరోపించారు. అలాగే కావేరీ పరివాహక ప్రాంతాల్లో మెథేన్ తవ్వకాలకు అనుమతించడం, శ్రీలంక తమిళుల విషయంలో అసంబద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలద్వారా డిఎంకె తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. పొత్తులు సహా అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం అధినేత్రి జయలలితకు అప్పగిస్తూ అన్నాడిఎంకె సమావేశం ఓ తీర్మానం చేపట్టింది. (చిత్రం) తిరువనంతపురంలో గురువారం నిర్వహించిన ఎఐఎడిఎంకె కార్యనిర్వాహక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జయలలితను సన్మానిస్తున్న దృశ్యం