బిజినెస్

విదేశీ ఆస్తులు వెల్లడించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పన్ను చెల్లింపుదారులకు జయంత్ సిన్హా హెచ్చరిక
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: విదేశాల్లో భారతీయులు కూడబెట్టిన ఆసుల వివరాలను 2017లోగా వెల్లడించకపోతే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, ఆ తర్వాత విదేశాల నుంచి ఆయా ఆస్తుల వివరాలను సేకరించే ప్రక్రియను ప్రభుత్వమే ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. గురువారం ఆయన ఎఇఓఐ (ఆటోమ్యాటిక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) గ్రూపు సమావేశంలో మాట్లాడుతూ, విదేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) సమాచార భద్రతా కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ‘ప్రస్తుతం అన్ని చోట్ల పారదర్శకతతో కూడిన సరికొత్త వాతావరణం ఏర్పడటంతో బ్యాంకుల్లో గోప్యతకు తెరపడింది. కనుక విదేశాల్లో కూడబెట్టిన ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే పన్ను చెల్లింపుదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు’ అని ఆయన తేల్చి చెప్పారు. సిబిడిటి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయపన్ను విభాగంలో పటిష్టమైన సమాచార భద్రతా వ్యవస్థను, క్యాడర్ కంట్రోల్ స్థాయిలో స్థానిక సమాచార భద్రతా కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జయంత్ సిన్హా తెలిపారు.
అమెరికా నుంచి ఆర్థిక సమాచారం
ఇదిలావుంటే, ఆర్థిక సమాచార మార్పిడి ఒప్పందం కింద అమెరికా నుంచి గత రెండు నెలల్లో కొంత సమాచారాన్ని సేకరించామని, ప్రస్తుతం దీనిని విశే్లషిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఆర్థిక సమాచార మార్పిడికి సంబంధించి భారత్, అమెరికా మధ్య కుదిరిన ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్టు (ఎఫ్‌ఎటిసిఎ) సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఇరు దేశాలు ఆర్థిక సమాచారాన్ని ఆటోమ్యాటిక్‌గా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించే ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని గత రెండు నెలల్లో అమెరికా నుంచి పొందిన సమాచారాన్ని విశే్లషిస్తున్నామని రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి అఖిలేష్ రంజన్ తెలిపారు.