రాష్ట్రీయం

రక్షణ రంగంలో ఇక దిగుమతులుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిఆర్‌డిఎల్ డైరెక్టర్ డాక్టర్ జయరామన్
హైదరాబాద్, డిసెంబర్ 10: రానున్న పది పదిహేనేళ్ల వరకూ మన దేశ రక్షణ రంగానికి దిగుమతుల అవసరమే ఉండబోదని డిఆర్‌డిఎల్ డైరెక్టర్ డాక్టర్ కె. జయరామన్ పేర్కొన్నారు. కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ అంశంపై మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ జయరామన్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ దేశ రక్షణ రంగానికి అవసరమైన యంత్ర సామగ్రీ, ఆయుధాలను స్వయంగా ఉత్పత్తి చేసుకోగలిగే స్థాయికి ఎదగడంతో పాటు 75 దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉందని, ఏరోస్పేస్ హబ్‌గా ఉద్భవించిందని, హెలికాప్టర్లను పూర్తిగా నిర్మించగలుగుతున్నామని, ఆకాశ్ క్షిపణి కోసం బిడిఎల్ దాదాపుగా 25వేల కోట్లను వెచ్చించబోతోందని అన్నారు. గీతం యూనివర్శిటీ నిర్వహించిన ఈ సదస్సులో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి మాట్లాడుతూ వస్తూత్పత్తిని వేగిరం చేయడంలో సిఏఈ కీలక భూమిక పోషిస్తోందని, వస్తు అభివృద్ధి ప్రక్రియ, సాంకేతక సమస్యల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని, మానవ వనరుల అభివృద్ధిపై ప్రభావం చూపే అంశంపై సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విసి ప్రొఫెసర్ జి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ వర్శిటీలో 163 పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు.

14 నుంచి విజయవాడలో కలెక్టర్ల సదస్సు
హైదరాబాద్, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల కలెక్టర్ల సదస్సు ఈ నెల 14 నుండి రెండు రోజుల పాటు విజయవాడలో జరగనుంది. కలెక్టర్ల సదస్సుకు సన్నాహకంగా ప్రధానకార్యదర్శి గురువారం కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రానున్న ఏడాదిలో అభివృద్ధి రేటు రెట్టింపు చేయడం, ప్రధానంగా స్థూల జాతీయోత్పత్తిని 15 శాతానికి చేర్చడం లక్ష్యంగా కలెక్టర్ల సమావేశం జరుగుతుందని తెలిసింది. కీలక ప్రగతి సూచికలు-పురోగతి, బడ్జెట్ రూపకల్పన, పరిశ్రమల విధానాన్ని అమలుచేయడం, ఇ-ప్రగతి, స్వచ్ఛ భారత్, నీరు- చెట్టు, సంజీవని, జన్మభూమి తదితర కార్యక్రమాల అమలుపై కలెక్టర్లతో సిఎం చంద్రబాబు విస్తృతంగా చర్చించనున్నారు. సదస్సులో వచ్చే అంశాల గురించి సిఎస్ కలెక్టర్లకు వివరించారు. సంక్షేమ పథకాల అమలు గురించి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చ వచ్చినపుడు ఏ వివరాలు అందించాలో కూడా వారికి చెప్పారు. ప్లానింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ పి టక్కర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి డాక్టర్ పి వి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితర అధికారులు ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

అంతర్ జిల్లా బదిలీలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, డిసెంబర్ 10: ఉపాధ్యాయ దంపతులతోపాటు పరస్పర అంతర్ జిల్లా బదిలీల షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను జిల్లా స్థాయిలో పరిశీలించిన వాటిని సంచాలకుడి స్థాయిలో అనుమతికి పంపిస్తారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాతనే సిబ్బంది కొత్త స్థానాల్లో చేరేలా ఆదేశించనున్నట్టు తెలిసింది.
ముగ్గురు అధికారులకు పోస్టింగ్
కేంద్ర సర్వీసుల నుండి రాష్ట్రానికి వచ్చిన ముగ్గురు అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఐర్‌ఎస్ అధికారి కోమల్ కిశోర్‌ను యువజన సర్వీసుల శాఖ స్పెషల్ కమిషనర్‌గా, వి. ప్రేంచంద్‌ను ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండిగా నియమించారు. కల్నల్ వి రాములును ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ సొసైటీ కార్యదర్శిగా నియమించారు.

ఓపెన్ వర్శిటీ పిజి, యుజి
పరీక్ష ఫీజు తేదీల గడువు పొడిగింపు
హైదరాబాద్, డిసెంబర్ 10: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించే వివిధ యుజి, పిజి, సర్ట్ఫికేట్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును 22వ తేదీ వరకూ పొడిగించారు. పిజి ఫస్టియర్, సెకండియర్, ఎంబిఎ మూడేళ్ల పరీక్షలు రాసేవారికి, డిప్లొమా, సర్ట్ఫికేట్ కోర్సులు చేస్తున్న వారికి పరీక్షలు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఉంటాయని, వారు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు డిసెంబర్ 22 వరకూ గడువుంటుందని యూనివర్శిటీ అధికారులు తెలిపారు. బిఎల్‌ఐసి, ఎంఎల్‌ఐఎస్సీ, సర్ట్ఫికేట్ ప్రోగ్రాం పరీక్షలు ఫిబ్రవరి 11 నుండి, ఫస్టియర్ ఎంఎ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబిఎ పరీక్షలు ఫిబ్రవరి 11 నుండి జరుగుతాయని, అలాగే పిజి సెకండియర్ పరీక్షలు, ఎంబిఎ సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 5 నుండి జరుగుతాయ. యుజి సెకండ్ స్పెల్ సప్లిమెంటరీ పరీక్షలకు డిసెంబర్ 22 లోగా ఫీజులు చెల్లించాలని సూచించారు. థర్డ్ ఇయర్ యుజి పరీక్షలు జనవరి 27 నుండి ఫిబ్రవరి 1 వరకూ, సెకండియర్ యుజి పరీక్షలు ఫిబ్రవరి 3 నుండి 8 వరకూ, ఫస్టియర్ యుజి పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 13 వరకూ జరుగుతాయని అధికారులు తెలిపారు.