రాష్ట్రీయం

జేడీఎస్‌కే మా మద్ధతు : ఎంపీ ఓవైసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు ఇచ్చి.. ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తామని తెలిపారు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని ఎంపీ ఓవైసీ పేర్కొన్నారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తామని ఈ ఏడాది జనవరిలో ఓవైసీ ప్రకటించిన విషయం విదితమే.