సాహితి

కాల్పనిక వచనం.. భాషకు జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సమాజ స్థితిగతులలో, తెలుగు నాట పుస్తక పఠనం దిగజారిపోవటానికి, మాతృభాష పట్ల ఆదరణ తగ్గటానికి రచయితలు, కవులు బాధ్యులనటంలో సందేహం లేదు. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థి ఎవ్వరైనా ఒకవేళ ఉత్సాహంగా కాలక్షేపం కోసం ఏదైనా నవల చదవాలని ప్రయత్నిస్తే ప్రస్తుత రచయిత ఫలానా పుస్తకం చదవమనటం లేదా చదివించటానికి ఆస్కారం లేదు. సంప్రదాయ వేషధారణతో పద్యాల పట్ల మక్కువ కలిగించే ప్రోత్సాహం స్పష్టవౌతున్నంత స్థాయిలో కూడా తెలుగు వచన రచనకు ప్రాధాన్యత లేదు. ఏ సాహితీ సమావేశాలలో చూసినా వేదికపైనా, శ్రోతలలో కూడా తలలు పండిన కవులు, రచయితలు వుంటారు. సత్కారాలు, సన్మానాలు, బిరుదులు, ప్రశంసలు హడావిడి తప్ప, తెలుగు భాషను యువతకు ఎట్లా అందించాలనే ఆలోచన కనపడదు. తెలుగుకు విశిష్టత, ఔన్నత్యం పద్యం వలన వచ్చే గౌరవం ఊసే తప్ప, తెలుగు వచనాన్ని, పలుకుబడిని సజీవం చేసుకోవాలనే తపన సాహితీవేత్తలలో కనపడదు.
పుంఖానుపుంఖంగా, వచన కవులు సాహిత్యం సృష్టిస్తున్నారు. పుస్తకాలు ప్రచురించి పంచి పెడుతున్నారు. ప్రశంసాయుతమైన ముఖ ప్రీతి ఉపన్యాసాలు, పుస్తక సమీక్షలు కొనసాగుతున్నాయి. ఆ సమావేశాలలో సాహిత్యం అంటే ఆసక్తిలేనివాళ్ళు, కాలక్షేపం కోసం వృద్ధులు వుంటారు. డజన్ల సంఖ్యలోవున్న సందర్భాలుంటాయి. వార్తాంశాలలో ఆవిష్కరణ, సన్మానం ఫొటో, పాల్గొన్నవారి పేర్లు మాత్రం వుంటాయి. ప్రముఖ సాహితీవేత్తలు వేదికలపై నుంచి వరుసగా కూర్చున్నవారి ప్రతిభాపాటవ పరిచయాలు చేయటం తప్ప భాష, పలుకుబడిని భవిష్యత్ తరాలకు ఎలా అందించగలమా అనే ఆలోచనలు, కార్యాచరణ వుండదు. ఆవిష్కరింపబడుతున్న ఆ పుస్తకం పేజీలు అప్పటికప్పుడే తిరగేసి, కవిని ప్రశంసించి పబ్బం గడిపేస్తారు. ఆ ప్రఖ్యాత రచయితలతో ఫొటోలు పుస్తకాలలో ప్రచురించుకోవటం ఆనవాయితీ, గర్వకారణం. ఇక సమావేశ నిర్వాహకులు తమ శక్తివంచన లేకుండా యిటువంటి కవులను సన్మానిస్తారు. ఆర్జిత సేవలు నిరాఘాటకం సాగిపోతుంటాయి. నిర్వాహక సంస్థల ప్రముఖులకు జయంతులు, వర్ధంతుల సందర్భంలో కూడా ఆ మహనీయుల సత్కృషి గురించి తెలియదు. తెలిసినవారు వేదికపై వుండవలసిన అవసరం లేదు. గతించిన సాహితీవేత్తల కుటుంబ సభ్యులు, బంధువుల సహాయ సహకారాలు లభించటం అదృష్టమే. కాని ఆ ప్రముఖ సాహితీవేత్తలు, కథా, నవలా రచయితలు, తెలుగును వాడుకభాషగా తీర్చి చదివించటానికి జీవితాంతం శ్రమించి, అందించిన సాహిత్యపు విలువలు వెలుగులోకి తెచ్చి యువతరంలో ఆసక్తి సృష్టించే ప్రయత్నం కనపడదు. తెలుగును రక్షించుకోవాలనే శుష్క నినాదాలు తప్ప, ప్రాథమిక, మాధ్యమిక స్థాయి బాలబాలికల తరగతి గదులవైపు తెలుగుభాషా ప్రేమికులు, సాహితీవేత్తలు చూడరు. వాళ్ళ గోల వాళ్ళదే.
యువతరం నిరంతరం ఉద్యోగ, ఉపాధిల అనే్వషణలో బతుకుతెరువు కోసం సతమతమవుతోంది. ప్రస్తుత సాంకేతిక సమాజంలో ఆంగ్లం తప్పదు. పిల్లల భవిష్యత్తుకోసం తపించే తల్లిదండ్రులందరూ భాషాప్రేమికులు, విద్యాధికులు, సాహితీప్రియులు, రచయితలు, సాహితీవేత్తలు కాదు. బతుకుతెరువు కోసం ఉపాధ్యాయ వృత్తిలో వున్నవారుకూడా విద్యావ్యాపారానికి ఔదలదాల్చాలి. తప్పదు. యిక ప్రభుత్వాలకు సంపన్నత సమకూర్చే విధానాలు, కార్యాచరణ, ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల రూపకల్పనతో, తెలుగుకు సంబంధం లేదు. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించే ముందు తెలుగు రచయితలు ఆలోచించుకోవాలి. బాల సాహిత్యం పాటలు పిల్లలకు ప్రీతికరమైనట్టే, యువతకు దిశానిర్దేశం చేయగల కథలు, నవలలు సృష్టించాలి. అర్ధశతాబ్దినాటి నవలా సాహిత్యంనాటి సామాజిక నేపథ్యాన్ని స్పష్టం చేస్తుంది కాబట్టి ప్రస్తుత యువతరం జీర్ణించుకోలేదు. వ్యాసాలు, దీర్ఘ కవితలు, అర్థంకాని పద్య సాహిత్యం యిక ఆకర్షించకపోవచ్చు. చదివించే సాహిత్యం కావాలి.
బాల్యంనుంచి యువతరం ఎదిగే ప్రస్థానానికి కుటుంబ, సమాజపరంగా ఎదుర్కొనే ప్రస్తుత నేపధ్యం ప్రేమ, పెళ్ళి, జీవితంలో స్థిరపడటానికి మార్గదర్శకంగా కాల్పనిక సాహిత్యం తెలుగులో కనపడదు. బాల్య వివాహ దురాచారాల నేపధ్యంలోని కన్యాశుల్కం నాటకంగా నాటి సమాజాన్ని, సాహిత్యాన్ని ప్రభావితం చేసినట్టే, యువతను చదివించే, ఆకర్షించే తెలుగు రచనలు వస్తే అదీ వచనంలో కొంతవరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగును చదివింపచేస్తుంది. ఒక మంచి పుస్తకం ఆకట్టుకొంటే యింకో మంచి కథ లేదా నవల చదవాలనే ఆసక్తి అంకురిస్తుంది. అందువలన తెలుగు రచయిత్రులు ప్రధానంగా తమ మేథస్సుకు పదునుపెట్టాలి. ప్రస్తుత సమాజంలో విద్యార్థినులు, ఉద్యోగినులు ప్రధానంగా మహిళలకు తెలుగు నవలలు చదివే అలవాటు వారు నిత్యం ఎదుర్కొంటున్న వేదనాయుత సంక్షోభం పరిష్కరించే దిశలో వుండాలి. ఒక్క నవల జీవితానికి చాలు. ప్రగాఢమైన భావోద్వేగ కల్పనా చాతుర్యం యితివృత్తమైతే తెలుగు సజీవ చైతన్య పలుకుబడి ప్రాచుర్యం పొంది వర్ధిల్లుతుంది. అటువంటి సాహిత్యం గుర్తించి యువతరం చదివేటట్టు చేయాలంటే, ప్రతి పాఠశాల తరగతి గదికి రచయితలు, అవకాశం వచ్చినపుడు యువతతో చర్చలు, విశే్లషణలు వారికి అర్థమయ్యే రీతిలో నిర్వహించాలి. పోటీల ద్వారా ఆకర్షించి చదివించాలి. వచన రచనల సరళత, ప్రాచుర్యమే భాషను మరింత సజీవం చేస్తుంది.

- జయసూర్య, 9440664610