అక్షర

స్ఫూర్తిదాయక జీవితచరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాస రామానుజం
సహజ మేధావి
-త్వరకవి వెంకట బాలకృష్ణమూర్తి
వెల. రు.160/-
ప్రతులకు: టి.వి.్ఫణీంద్రనాథ్
శ్రీ లక్ష్మీనివాస్ ఏజెన్సీస్
ట్రంక్‌రోడ్, నెల్లూరు
98662 92694

‘శ్రీనివాస రామానుజం అంకెలతో ఆడుకున్న గణితశాస్తవ్రేత్త. మహామేధావి. 1918లో లండన్ రాయల్ సొసైటీ ఆయనకు ఎఫ్.ఆర్.ఎస్. ప్రదానం చేసింది. ఇది ప్రపంచస్థాయి గౌరవం. గణితశాస్త్రంలో అజేయమైన మూల సిద్ధాంతాలకు లభించిన గౌరవం అది’అని పుస్తకానికి రాసిన ముందుమాటలో డా.కె.వి.రాఘవాచార్య తెలిపారు.
‘విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ చదవాల్సిన పుస్తకం ఇది’ అని ప్రముఖ విద్యావేత్త డా.చుక్కా రామయ్య ప్రశంసించారు.
భారతీయ ప్రాచీన విద్యాలయాల గురించి, ఆనాటి శాస్తవ్రేత్తల గురించి కొన్ని విశేషాలను పుస్తకం ప్రారంభంలో రచయిత త్వరకవి వెంకట బాలకృష్ణమూర్తి ఆసక్తికరంగా వివరించారు.
రామానుజం బాల్యం దగ్గరనుంచి మొదలుపెట్టి అతడి విద్యాభ్యాసం, లండన్ ప్రయాణం, భారతదేశానికి తిరిగి రావటం వరకు జరిగిన సంఘటనలన్నీ పుస్తకంలో సమగ్రంగా వివరించారు. రామానుజం అంతరంగాన్నీ, అతడి ఆలోచనా సరళినీ ఆవిష్కరించిన విధానం ప్రశంసనీయంగా ఉంది.
పుస్తకంలో అక్కడక్కడా కొన్ని గణితశాస్త్ర సమస్యలను ఉదాహరించారు.
రామానుజానికి దైవభక్తి ఎక్కువ. నామక్కళ్ పట్టణంలో ఉన్న నామగిరి దేవత ఆయనకు ఇష్టదైవం. ‘తన శక్తిసామర్థ్యాల మీద అచంచల విశ్వాసం ఉన్నా అదంతా నామగిరి కరుణాకటాక్షంగా విశ్వసించేవాడు రామానుజం’ (పేజి.17).
హైస్కూలు దశలోనే అతడి మేధాశక్తికి గుర్తింపు లభించటం ప్రారంభమయింది. కళాశాలలో ఎఫ్.ఎ.లో చేరిన తరువాత అక్కడి ప్రొఫెసర్లకు, రామానుజం సామాన్యుడు కాడనే సంగతి అర్థమయింది. లండన్‌లో ఉన్న కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధికార్లకు వాళ్లు రామానుజం గురించి తెలిపారు.
గణితశాస్త్రంలో తాను కనుగొన్న విషయాలను తెలియజేస్తూ ఆనాటి ప్రపంచ ప్రఖ్యాత గణితశాస్త్ర ఆచార్యులకు రామానుజం లేఖలు రాసి పంపించాడు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా స్కాలర్‌షిప్ ఇవ్వటంతో లండన్ వెళ్లి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 29 సంవత్సరాల వయస్సులోనే ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వంవారి అత్యున్నత పురస్కారం ఎఫ్.ఆర్.ఎస్.ను అందుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చాడు.
భారతదేశానికి తిరిగి వచ్చిన కొద్దికాలంలోనే 1920 ఏప్రిల్ నెలలో తన జీవితం ముగించాడు.
రామానుజం జీవితచరిత్రను ముగిస్తూ రచయిత ‘గణితశాస్త్ర అధ్యయనంలో ఒక శకం అంతరించింది. కాని రామానుజం పరిశోధనలు మరో వేయి సంవత్సరాలు బతికి తరతరాల గణితానే్వషకుల నుత్తేజపరుస్తాయి. చిరకాలం ఆయన్ను బ్రతికిస్తాయి’ అన్నారు. పుస్తకం చదివినప్పుడు ఆ మాటలు అక్షరసత్యమనే సంగతి తెలుస్తుంది.
పుస్తకంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి సంబంధించిన ఫొటోలు కూడ ప్రచురించారు.
జీవిత చరిత్ర రాయటంలో రచయిత అనుసరించిన విధానం బాగుంది.

-ఎం.వి.శాస్త్రి