జనగణమనతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛార్మి.. ఈ పేరు వింటేనే ఓ ఐదారేళ్ల క్రితం టాలీవుడ్ వెర్రెత్తిపోయేది. అందుకు తగ్గట్టు ఆమె సినిమాలు కూడా ప్రేక్షకులకు నచ్చేవి. ప్రెట్టీగాళ్‌గా అందరి మన్ననలు అందుకున్న ఛార్మి ఆ తరువాత అవకాశాల రేసులో వెనుకబడిపోయింది. ఆమె చివరిగా నటించిన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సరైన విజయం అందుకోకపోవడంతో అసలు సున్నాలాగా మారిపోయింది. అప్పుడప్పుడు ఐటెం పాటల్లో అక్కడక్కడా కనిపించే ఛార్మి జ్యోతిలక్ష్మి తరువాత కనుమరుగైంది. ఇక లాభం లేదని తానే ఓ సినిమా నిర్మించడానికి సిద్ధమవుతోందట. ఆ సినిమా పేరే ‘జనగణమన’. ఆలోచన అయితే బాగానే వుంది కానీ ఈ సినిమాతో ఇక ఆమె కూడా ఇండస్ట్రీకి జనగణమన పాడనుందా అని టాలీవుడ్‌లో సెటైర్లు వినపడుతున్నాయి. జనగణమన అన్న పేరు గతంలో కొందరు ప్రయత్నించినా వాళ్లకు వర్కవుట్ కాలేదు. ఛార్మికన్నా అవుతుందేమో చూడాలి!