జాతీయ వార్తలు

జీతాలు ఇప్పించాలని జెట్ ఎయిర్‌వేస్ పైలట్ల మొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తమ జీతాలు ఇప్పించాలని జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు ప్రధాని మోదీకి, విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభులకు లేఖలు రాశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తమ సంస్థ పతనం అంచుల్లో ఉందని, అదే జరిగితే వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతారని వారు ఆ వినతిపత్రాల్లో పేర్కొన్నారు. గత కొన్ని నెలల నుంచి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, ఇకనైనా జీతాలు ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ ప్రధాని మోదీకి, విమానయాన శాఖ మంత్రికి లేఖ రాసింది. మార్చి 31వ తేదీలోగా వేతనాలు చెల్లించలేకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సమ్మెకు వెళతామని హెచ్చరించారు.