జాతీయ వార్తలు

జెట్ ఎయిర్‌వేస్‌కు నా డబ్బును ఉపయోగించండి:మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్థిక ఊబీలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ సంస్థను కాపాడేందుకు నా డబ్బును ఉపయోగించాల్సిందిగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న మాల్యా కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు ఎస్‌బిఐ దేశీయ రుణదాతల ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్ గోయల్, ఆయన భార్య తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ప్రభుత్వ బ్యాంకులు జెట్ ఎయిర్‌వేస్‌ను తీసుకుని ఎందరో ఉద్యోగులను, సంస్థను కాపాడటం ఆనందంగా ఉందని అయితే కింగ్ ఫిషర్‌ను ఇలాగే ఆదుకుని వుంటే బాగుండేదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై తాను ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలపై బీజేపీ దుమ్మెత్తి పోశాయని ఆయన ఆరోపించారు. తన ఆస్తులను తీసుకుని జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడాల్సిందిగా ఆయన కోరారు.