రాష్ట్రీయం

చివరి వరకూ జెట్‌స్పీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి రౌండ్‌లోనూ టిఆర్‌ఎస్ ఆధిక్యత
కౌంటింగ్‌కు హాజరుకాని కాంగ్రెస్ అభ్యర్థి

వరంగల్, నవంబర్ 24: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లారు. ప్రతి రౌండ్‌లో టిఆర్‌ఎస్ ఆధిక్యత కనబర్చింది. ఉప ఎన్నికల ఫలితాల ప్రక్రియ మంగళవారం ఉదయం ఏనుమాముల మా ర్కెట్‌లో ప్రారంభమయ్యాయి. ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్లమెంటు ని యోజకవర్గ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను 22 రౌండ్‌లుగా విభజించి లెక్కింపు ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1 గంటల వరకు ఫలితాలు వెలువడ్డాయి. ప్రతి రౌండ్‌లలో టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్, ప్రతిపక్షాల అభ్యర్థులకు అందకుండా దూసుకెళ్లారు. మొత్తం 22 రౌండ్‌లలో ఓట్ల ఎక్కింపు మొదలైంది. మొదటి రౌండ్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థికి 32వేల 798 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 8వేల 75, బిజెపి అభ్యర్థికి 7వేల 591 ఓట్లు వచ్చాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థికి మొదటి రౌండ్‌లో 24వేల 723 మెజార్టీ సాధించాడు. రెండో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 34వేల 515 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థికి 10వేల 626, బిజెపికి 5వేల 985 వచ్చాయి. మూడో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 33వేల 701, కాంగ్రెస్‌కు 9వేల 371, బిజెపికి 6వేల 364, నాలుగో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 32వేల 940, కాంగ్రెస్‌కు 9వేల 350, బిజెపి 6వేల 478, ఐదో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 31వేల 172, కాంగ్రెస్‌కు 8వేల 700, బిజెపికి 7వేల 360, ఆరవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 36వేల 373, కాంగ్రెస్‌కు 8వేల 664, బిజెపికి 6వేల 1475, ఏడో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 31వేల 782, కాంగ్రెస్‌కు 8వేల 82, బిజెపికి 5వేల 985, ఎనిమిదవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 34వేల 690, కాంగ్రెస్‌కు 8వేల 134, బిజెపికి 6వేల 773, తొమ్మిదో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 35వేల 595, కాంగ్రెస్‌కు 8వేల 525, బిజెపికి 7వేల 308, 10వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 33వేల 596, కాంగ్రెస్‌కు 8వేల 892, బిజెపికి 7వేల 748, 11వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 36వేల 157, కాంగ్రెస్‌కు 8వేల 363, బిజెపికి 7వేల 648, 12వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 35వేల 944, కాంగ్రెస్‌కు 8వేల 943, బిజెపికి 6వేల 855, 13వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 34వేల 695, కాంగ్రెస్‌కు 7వేల 104, బిజెపికి 7వేల 585, 14వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 33వేల 162, కాంగ్రెస్‌కు 9వేల 290, బిజెపికి 7వేల 743, 15వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 34వేల 528, కాంగ్రెస్‌కు 8వేల 134, బిజెపికి 8వేల 885, 16వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 33వేల 855, కాంగ్రెస్‌కు 7వేల 599, బిజెపికి 6వేల 424, 17వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 26వేల 56, కాంగ్రెస్‌కు 5వేల 863, బిజెపికి 6వేల 201, 18వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 16వేల 72, కాంగ్రెస్‌కు 5వేల 52, బిజెపికి 5,344, 19వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 13వేల 954, కాంగ్రెస్‌కు 4వేల 993, బిజెపి 3వేల 730, 20వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 6వేల 906, కాంగ్రెస్‌కు 1778, బిజెపికి 963, 21వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 5వేల 616, కాంగ్రెస్‌కు 969, బిజెపికి 925, 22వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 1356, కాంగ్రెస్‌కు 354, బిజెపికి 135 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థికి 6,15,403 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 1,56,311, బిజెపి అభ్యర్థికి 1,30,178 ఓట్లు సాధించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 4,59,092 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ కౌంటింగ్‌కు హాజరుకాలేదు.