జాతీయ వార్తలు

జేఏన్‌యూ వీసీకి హెచ్‌ఆర్డీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జేఏన్‌యూలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. వర్శిటీ వీసీ జగదీశ్ కుమార్ హెచ్‌ఆర్డీ సెక్రటరీతో సమావేశం అవ్వాలని ఆదేశించింది. జేఎన్‌యూ వైస్ చాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ మేరకు హెచ్‌ఆర్డీకి వినతిపత్రాలు సైతం సమర్పించారు. కాని హెచ్‌ఆర్డీ ఈ డిమాండ్‌ను తోసిపుచ్చింది. ఆయనతో హెచ్‌ఆర్టీ సెక్రటరీ చర్చలు జరుపుతారని స్పష్టం చేసింది. ఇదిలావుండగా.. ఎన్‌యూ వైస్ చాన్సలర్ ఎం జగదీష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ప్రదర్శనకారులు గురువారం వీధుల్లోకి వచ్చారు. సీపీఐ(ఎం) నాయకులు సీతారాం ఏచూరి, డి రాజా, ప్రకాష్ కారత్, బృందా కారత్, ఎల్జెడి నాయకుడు శరద్ యాదవ్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.