రాష్ట్రీయం

కొలువుల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భర్తీపై అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్యుద్ధం 56,150 పోస్టుల భర్తీకి చర్యలు: మంత్రి ఈటల
భర్తీలో ప్రభుత్వ జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర నిరసన 1.7 లక్షల ఖాళీలు భర్తీ చేయాలన్న తెదేపా

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఈ విషయమై విపక్షాలు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, వివిధ శాఖల్లో 56,150 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాజీలేదని ఆయన హామీ ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య రగడ జరిగింది. ప్రభుత్వం గత ఏడాది 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొని, ప్రస్తుతం 56వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పడంపై టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన నిరుద్యోగులకు అన్యాయం చేయవద్దని వారు కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి ఈటల రాజేందర్ బదులిస్తూ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5.23 లక్షల ఉద్యోగాలను కేటాయించారని, ఇందులో 4.35 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. వివిధ శాఖల నుంచి తెచ్చుకున్న సమాచారం ప్రకారం 56వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం 18,423 ఉద్యోగాల భర్తీ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
ఇందులో 14,789 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు చెప్పారు. ఇంతవరకు 3950 ఆర్టీసి ఉద్యోగులను పర్మినెంట్ చేశామన్నారు. సింగరేణిలో 4500 ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ జరిగిందన్నారు. 25,589 కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారన్నారు. వీరికి వేతనాలు పెంచామన్నారు. ఎన్‌ఎంఆర్ ఉద్యోగాలు 8192 ఉద్యోగాలు, అంగన్‌వాడీ, హోంగార్డులు 80861 మంది పనిచేస్తున్నారన్నారు. టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేవలం 439 గ్రూప్-2 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, దీనికి ఐదు లక్షల మంది దరఖాస్తు చేశారన్నారు. గత ఏడాది ప్రకటించిన ఒక లక్ష ఉద్యోగాల ఖాళీలు ఏమయ్యాయన్నారు.
డిఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం 21 నెలలుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు. తమిళనాడు తరహాలో టెట్‌తో సంబంధం లేకుండా చూడాలన్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వూ లేకుండా చూడాలన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఒక లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి, ఇప్పుడు మాట మార్చి 56 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనని చెప్పడం శోచనీయమన్నారు. నిరుద్యోగుల భవిష్యత్‌ను దెబ్బతీసేలా వున్న ప్రభుత్వ వైఖరికి కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియచేస్తున్నట్లు ప్రకటించారు.