కృష్ణ

ఎండలు బాబోయ్.. ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 23: ఎండలు బాబోయ్.. ఎండలు అంటూ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 24న రోహిణీ ప్రారంభం కావటంతో రెండు రోజులు ముందు నుంచే ఎండలు జిల్లా ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇదే పరిస్థితి 15 రోజుల పాటు ఉంటుందని సంబంధిత శాఖాధికారులు చెబుతుండటంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. శని, ఆది వారాల్లో కంటే సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగటంతో జిల్లా ప్రజలు మలమలమాడారు. రాత్రి 8గంటల వరకు వేడి తగ్గకపోవటం విశేషం. ముఖ్యంగా పసి కందులు, వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భవతులు పడిన అవస్థలు అంతా ఇంతా కాదు. ఉదయం 8గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. పశుపక్షాదులు వేడికి తట్టుకోలేక అల్లల్లాడాయి. నీటి కోసం తహతహలాడాయి. జన సంచారం లేక రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షం నీరు మూడు రోజులుగా వీస్తున్న వడగాల్పులకు ఆవిరైపోయాయి. 15 రోజులు పాటు ఇలాగే ఉంటే వృద్ధులు పిట్టిల్లా రాలిపోయే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఎండ తీవ్రతను తట్టుకోలేక శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు ప్రజలు పుచ్చకాయలు, కొబ్బరిబొండాలు, శీతల పానియాలను పెద్ద ఎత్తున ఆశ్రయించారు. సోమవారం పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ 15 రోజులు ఎలా బతకాలా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మే 23: మొబైల్ డివైజ్ మేనేజ్‌మెంట్ సిస్టంనందు టాబ్స్ అన్ని వెంటనే నమోదు చేయాలని జాయింటు కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జెసి అధికారులతో సమావేశమై మీకోసం అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్, సివిల్ సప్లయిస్, డిఆర్‌డిఎ, రెవెన్యూ తదితర శాఖల్లోని అర్జీలు పెండింగులో ఉంటున్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి 12వేలకు పైగా అర్జీలు పెండింగ్‌లో ఉండగా వీటిలో జన్మభూమి పిటిషన్లు 10లకు పైగా ఉన్నాయన్నారు. అర్జీదారులు అర్జీలో ఇచ్చిన చిరునామాలో ఉండడం లేదని, అందువల్ల ఆలస్యం అవుతున్నాయని అధికారులు వివరణ ఇవ్వగా వారంలోగా పరిష్కరించాలని, ఇదే చివరి అవకాశమని, లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని జెసి స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం ఇచ్చిన టాబ్స్ క్షేత్ర స్థాయిలో వినియోగిస్తున్నారని, వీటన్నింటినీ మొబైల్ డివైజ్ మేనేజ్‌మెంట్ సిస్టంలో నమోదు చేయించాలని, తద్వారా డివైజ్ ఎక్కడ ఉంది, ఎవరు వినియోగిస్తున్నారు, ఏ పనికోసం వినియోగిస్తున్నారు అనే విషయం తెలుస్తుందన్నారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను జెసి చంద్రుడు స్వీకరించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ చెకూరి రంగయ్య, ఆర్డీవో పి సాయిబాబు, డిపివో కృష్ణకుమారి, జడ్‌పి సిఇఓ వి నాగార్జున సాగర్, మున్సిపల్ కమీషనర్ జస్వంతరావు, డిఎస్‌ఓ రవి కిరణ్, ఎల్‌డిఎం వెంకటేశ్వరరెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌ఓ డా. ఆర్ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పాలేటి గుంటలో పడి
బాలుడి మృతి
జగ్గయ్యపేట రూరల్, మే 23: మండలంలోని అన్నవరంలో పాలేటి నీటి గుంటలో పడి సోమవారం ఒక బాలుడు మృతి చెందాడు. గ్రామ విఆర్‌ఒ చంద్రశేఖర్ తెలిపిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన పర్ల నాగరాజు (9) మరో ఇద్దరు బంధువుల పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని పాలేటికి ఈతకు వెళ్లారు. వంతెన కింద గల పాలేటిలో పొలాల కోసం తీసిన గుంటలో ప్రమాదవశాత్తు పడి మునిగిపోయాడు. తోటి పిల్లలు ఈ విషయాన్ని గ్రామస్థుల దృష్టికి తీసుకురాగా గ్రామస్థులు ఆ బాలుడిని బయటకు తీసేలోపే మృతి చెందాడు.

నాగేశ్వరరావు హత్య కేసులో ముగ్గురి అరెస్టు
తిరువూరు, మే 23: తిరువూరులో సంచలనం సృష్టించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, అక్కపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ దోమతోటి వెంకటరమణ భర్త నాగేశ్వరరావు హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు నూజివీడు డిఎస్‌పి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముద్దాయిలు గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన కొర్రప్రొలు శ్రీనివాసరెడ్డి, అతని బావమరిది మున్నంగి హనుమారెడ్డి, స్నేహితుడు సింగంశెట్టి హనుమంతరావును ఉండవల్లి సెంటరులో అరెస్టు చేసి వారి నుంచి హత్యకు వినియోగించిన అంబాసిడర్ కారు, ఒక కత్తి, రెండు జాకి రాడ్లు, మరో రెండు సెల్‌ఫోన్లు స్వాధీనపర్చుకున్నామన్నారు. నాగేశ్వరరావుకు అక్కపాలెంలో ఉంటున్న మొదటి ముద్దాయి శ్రీనివాసరెడ్డి భార్యతో వివాహేతర సంబంధం ఉందని, దీంతో కక్ష పెంచుకున్న అతను మిగిలిన ముద్దాయిలతో కలిసి హత్యకు పాల్పడినట్లు డిఎస్‌పి చెప్పారు. కంకిపాడులో కారు, నూతక్కిలో కత్తి, విజయవాడ ఆటోనగర్‌లో రాడ్‌లు కొనుగోలు చేసి ఈ నెల 16వ తేదీ రాత్రి రిక్కీ జరిపి విఫలమై వియం బంజర్ లాడ్జిలో బస చేశారన్నారు. తిరిగి ఈ నెల 17న రాత్రి నాగేశ్వరరావును వెంబడించి అక్కపాలెం వాటర్ ట్యాంక్ వద్ద మాటు వేసి రాత్రి 11.30 - 12 గంటల సమయంలో ట్యాంక్ నుంచి నీళ్ళు వదలాలని వాల్‌నట్ తిప్పేందుకు వచ్చిన నాగేశ్వరరావుపై కత్తి, రాడ్లతో దాడి చేసి హత్య చేశారన్నారు. నాగేశ్వరరావు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న మరో ముద్దాయి శివశంకరరెడ్డి మైలవరం వద్ద గ్యాస్ బండల లారీని ఢీకొని గాయపడి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. చికిత్స తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఈ కేసు విచారణ ఇంకా ముగియలేదని, గ్రామంలో అవినీతి వెలికితీస్తున్నాడన్న కారణంతో కొందరు హత్య చేయించారని కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు ఆ కోణంలో కూడా ముమ్మర దర్యాప్తు జరుగుతోందన్నారు. నాగేశ్వరరావు దళితుడైనందున ఎస్సీ, ఎస్‌టి చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. రెండు నెలలుగా నాగేశ్వరరావు హత్యకు కుట్ర జరుగుతోందని, కారుతో తొక్కించాలని కూడా ప్రయత్నించినట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు. సిసి కెమోరాలు, ఫోన్ కాల్ డేటా, బలమైన సాక్ష్యాధారాలతో దోషులను పట్టుకున్నట్లు డిఎస్‌పి వివరించారు. కేసు విచారణాధికారి జగ్గయ్యపేట సిఐ వైవిఎల్ నాయుడు, తిరువూరు సెక్టార్ -2 ఎస్‌ఐ కన్నప్పరాజు విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.