Others

భారీ ఆశల జూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై ‘జూలి’ పేరుకు ఓ ప్రత్యేకత వుంది. ఈ పేరుతో రూపొందిన సినిమాలు సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు మరోసారి అదే పేరుతో ఓ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో గ్లామర్ పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్న అందాల భామ లక్ష్మీరాయ్ ప్రస్తుతం పవన్ సరసన సర్దార్ గబ్బర్‌సింగ్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో కూడా నర్తించింది. తాజాగా ఈమె బాలీవుడ్‌లో ‘జూలీ-2’ పేరుతో రూపొందే సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కే ఈ సినిమా ఆమధ్య నేహా ధూపియా నటించి సంచలనం సృష్టించిన ‘జూలీ’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాతో తన కెరీర్‌కు గట్టి టర్నింగ్ వుంటుందని భావిస్తోంది లక్ష్మీరాయ్. మరి బాలీవుడ్‌లో ఈమె కెరీర్ ఎలాంటి టర్నింగ్ తీసుకోనుందో చూడాలి.