తెలంగాణ

మహబూబ్‌నగర్ - జంప్ జిలానీల బెడద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్ర సమీకరణలు.. బేరసారాలు
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస, కాంగ్రెస్
రెండు స్థానాలకు గులాబీ అభ్యర్థుల పోటీ
ఒక్కొక్క స్థానానికే పోటీ చేస్తున్న కాంగ్రెస్, టిడిపి

మహబూబ్‌నగర్, డిసెంబర్ 10: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలు మహబూబ్‌నగర్ జిల్లాలో విచిత్రమైన రాజకీయ పరిణామాలకు దారితీస్తోంది. అందులో భాగంగా అన్ని పార్టీలలో జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు జంప్ జిలానీలుగా మారుతున్నారు. ముఖ్యంగా ఈ బెడద కాంగ్రెస్, టిడిపిలను వెంటాడుతోంది. ప్రతిరోజు కాంగ్రెస్, టిడిపిల నుండి ఒకరిద్దరు చొప్పున గులాబీ గూటికి చేరుతున్నారు. దాంతో ఎవరు ఏ పార్టీలో ఉంటారనే స్పష్టత కొరవడింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార టిఆర్‌ఎస్ పార్టీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డిలను రంగంలోకి దింపి గెలుపే ధ్యేయంగా ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కాంగ్రెస్, టిడిపిలను దెబ్బకొట్టేందుకు మంత్రులతో సహా తెరాస ఎమ్మెల్యేలు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య బట్టి చూస్తే తెరాసకు ఒక స్థానం మాత్రమే దక్కే అవకాశం ఉందని, మరో అభ్యర్థి గెలవాలంటే ఇతర పార్టీల నుండి దాదాపు 70 నుండి 110 వరకు జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు అదనంగా అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని తెరాస నాయకులు ఇతర పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను గులాబీ గూటికి చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్ల పర్వం ముగియకముందు నుండే వలసలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా సంఖ్య బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని మాత్రమే పార్టీ తరపున దామొదర్‌రెడ్డిని రంగంలోకి దింపింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ఏకతాటిపై ఓట్లు వేస్తే కాంగ్రెస్ అభ్యర్థి సునాయసంగా గెలిచే అవకాశం ఉన్నట్లు ఆపార్టీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. అయితే జిల్లాలో ఏదో ఓ మూలన ఎంపిటిసిలు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తెరాసలో చేరుతుండడంతో కాంగ్రెస్ పార్టీను జంప్ జిలానీల బెడద వెంటాడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వాదన మాత్రం మరోలా ఉంది. ఒక ఓటు తెరాసకు వేసి మరో ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి పార్టీ మారిన ఓటర్లు తప్పకుండా ఓటు వేస్తారని, రెండు ఓట్లు మాత్రం తెరాసకు వేయరని కరాఖండిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంతేకాకుండా టిఆర్‌ఎస్‌కు సంబంధించిన 35నుండి 50మంది ఎంపిటిసిలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడం, ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు వ్యూహాలను రచిస్తున్నారు. అంతేకాకుండా టిడిపి, బిజెపి, వామపక్ష పార్టీల సభ్యుల ఓట్లను కూడా రాబట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఎత్తుగడలు వేస్తూ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అంతేకాకుండా టిడిపి తరుపున పోటీ చేస్తున్న దయాకర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌తో కలసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయినప్పటికీ ఒక స్థానానికి మాత్రమే ఇరువురు పోటీ చేస్తుండడంతో ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఇరుపార్టీల నేతలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. సంప్రదింపులు ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్, టిడిపిలకు జంప్ జిలానీల బెడద మాత్రం వెంటాడుతుండడం ఈ రెండు పార్టీల నాయకులు మరింత వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లకు లక్షల రూపాయల బేరసారాలు కొనసాగిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రసవత్తరంగా మారడం విచిత్రమైన రాజకీయ సమీకరణాలు చోటుచేసుకుంటుండడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్, తెరాస నాయకులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.