రాష్ట్రీయం

క్యూ కట్టిన కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

16 పరిశ్రమలకు టిఎస్‌ఐ‘పాస్’ రూ.1571 కోట్లతో స్థాపన అనుమతులు అందించిన జూపల్లి
హైదరాబాద్, నవంబర్ 21: టిఎస్‌ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో 16 పరిశ్రమలకు శనివారం అనుమతిచ్చారు. 1571.64 కోట్ల రూపాయల వ్యయంతో 16 పరిశ్రమలను రాష్ట్రంలో స్థాపించనున్నారు. ఈ పరిశ్రమల వల్ల మొత్తం 1812 మందికి ఉపాధి లభిస్తుంది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ మూడు జిల్లాల్లో 16 పరిశ్రమలకు అనుమతిచ్చారు. పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశ్రమల అధిపతులకు సచివాలయంలో అనుమతి పత్రాలు అందించారు. టిఎస్‌ఐపాస్ ద్వారా సత్వరం పరిశ్రమల స్థాపనకు అనుమతివ్వడం వల్ల దేశవ్యాప్తంగా తెలంగాణ గుర్తింపు పొందిందని జూపల్లి తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా సత్వరం అన్‌లైన్‌లో దరఖాస్తులు పరిశీలించి అనుమతివ్వడం బాగుందని మీడియాతో మాట్లాడుతూ వివిధ పరిశ్రమల యజమానులు తెలిపారు. అమెరికాలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో సైతం టిఎస్‌ఐపాస్ విధానాన్ని అభినందించారని జూపల్లి తెలిపారు. పరిశ్రమల్లో మహిళా ఉద్యోగులకు అవకాశాలు కల్పించాలని కోరారు.
ఇవే ఆ పరిశ్రమలు
మెదక్‌లో 55 కోట్ల పెట్టుబడితో 10 మెగావాట్ల సామర్ధ్యంతో సోలాల్ శ్రీరామ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించనున్నారు. మెదక్‌లో 22కోట్ల పెట్టుబడితో లోకేశ్ మిషన్ లిమిటెడ్, రంగారెడ్డిలో 33 కోట్లతో ప్రెకా సొల్యూషన్, మెదక్‌లో 41 కోట్లతో మెఘా ప్రూట్ ప్రాసెసింగ్ , మహబూబ్‌నగర్‌లో 74కోట్ల వ్యయంతో పది మెగావాట్ల సోలార్ పవర్ (క్రాంతి ), మెదక్‌లో 900 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్ టైర్ల ఫ్యాక్టరీ నిర్మిస్తారు. దీనివల్ల 500 మందికి ఉపాధి లభిస్తుంది. రంగారెడ్డిలో 17 కోట్లతో బొటెక్ ఇండియా లిమిటెడ్, మెదక్‌లో 16 కోట్లతో సోలాల్ విద్యుత్ కంపెనీ, మహబూబ్‌నగర్‌లో 76 కోట్లతో పది మెగావాట్ల సోలార్ విద్యుత్ కంపెనీ షైనింగ్ సన్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. జిఎంఆర్ 27 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్కేంద్రం ఏర్పాటు చేస్తారు. హల్డీరామ్ కంపెనీ మహబూబ్‌నగర్‌లో 64 కోట్ల పెట్టుబడితో 10 మెగావాట్ల సోలార్ విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.