రాష్ట్రీయం

దేవస్థానాల మాస్టర్‌ప్లాన్‌ల సమీక్షకు జ్యూరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెఎస్‌వి ప్రసాద్ అధ్యక్షతన కమిటీ

హైదరాబాద్, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌లను సమీక్షించి ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా మాజీ చీఫ్ ఇంజనీర్ ఆర్ కొండలరావు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సిఎస్‌వి రామమూర్తి, ఎపి అర్బన్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి ఎన్ చంద్రమోహన్‌రెడ్డి, దేవాదాయ శాఖ డిప్యూటీ శతపథి సభ్యుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో వివిధ దేవాలయాల నిర్మాణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌లను ఈ కమిటీ సమీక్షించి తదుపరి చర్యలను చేపడుతుంది.