జాతీయ వార్తలు

సుప్రీం సిజెగా జస్టిస్ ఠాకూర్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3:శారద కుంభకోణం, బిసిసిఐ సంస్కరణలు సహా అనేక కీలక తీర్పులు వెలువరించిన సీనియర్ న్యాయమూర్తి 63 సంవత్సరాల టి.ఎస్.్ఠకూర్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. భారత దేశ 43వ చీఫ్ జస్టీస్‌గా ఠాకూర్ చేత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాష్టప్రతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్టప్రతి హమిద్ అన్సారీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ పదవిలో 13 నెలల పాటు కొనసాగిన అనంతరం 2017 జనవరి నాలుగున ఠాకూర్ రిటైర్ అవుతారు. ఇప్పటి వరకూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన హెచ్.ఎల్.దత్తూ నుంచి ఠాకూర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.