జాతీయ వార్తలు

బాల నేరస్థుల బిల్లును సత్వరమే ఆమోదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలకు అతీతంగా పార్టీల ఆకాంక్ష
ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న రవిశంకర్ ప్రసాద్
సహకరించాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: బాల నేరస్థుల న్యాయ చట్టాన్ని సవరించడంలో జరుగుతున్న జాప్యంపై అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పరం నిందారోపణలు చేసుకున్నాయి. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరలో ఈ చట్ట సవరణలకు ఆమోదం లభించాలని రాజకీయాలకు అతీతంగా సోమవారం వివిధ పార్టీలు ఆకాంక్షించాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన డిసెంబర్ 16 గ్యాంగ్ రేప్ కేసులో బాల నేరస్థుడి విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇటీవల తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ బాల నేరస్థుల న్యాయ చట్టాన్ని సవరించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం ఆసక్తితో ఉందని, ఇందుకు సంబంధించిన అనుబంధ ఎజెండాను ఈరోజే సభ ముందుకు తీసుకువచ్చేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్ వెలుపల విలేఖర్లకు తెలిపారు. గతంలో ఈ బిల్లు ఆమోదం నిమిత్తం మూడుసార్లు రాజ్యసభ పరిశీలనకు వచ్చిందని, అయితే ప్రతిపక్షాల తీరు వలన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి వలన సభ సజావుగా జరగక ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదని ఆయన విమర్శించారు. బాల నేరస్థుల న్యాయ చట్టాన్ని సవరించకపోవడం పట్ల దేశ వ్యాప్తంగా ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతోందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొంటూ, ఈ బిల్లు ఆమోదానికి సహకరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. ‘బాల నేరస్థుల చట్ట సవరణ బిల్లు ఆమోదానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఆశిస్తున్నా’ అని ఆయన అన్నారు. కాగా, బాల నేరస్థుల చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందాలని యావత్ దేశం ఆకాంక్షిస్తోందని, కనుక రానున్న రెండు రోజుల్లో రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ముందుకు వచ్చి ఈ బిల్లును ఆమోదిస్తాయని ఆశిస్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రియాన్ తెలిపారు.