క్రీడాభూమి

కోలుకోని రహానే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 23: నుంచి కోలుకోలేదు. దీనితో అతనికి బ్యాకప్‌గా ఉండేందుకు గుర్‌కీరత్ సింగ్ మాన్‌ను భారత జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనునాగ్ ఠాకూర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు అందుబాటులో ఉండడని, అతని స్థానంలో రిషీ ధావన్‌నుఎంపిక చేశామని అతను పేర్కొన్నాడు. రహానేను టి-20 సిరీస్‌కు ప్రకటించిన జట్టు నుంచి పక్కకు తప్పించకపోయినా, ముందు జాగ్రత్త చర్యగా గుర్‌కీరత్‌ను స్టాండ్‌బైగా ఉంచామని తెలిపాడు. ఎడమచేతి బొటనవేలికి గాయమైన భువనేశ్వర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని అన్నాడు. అతనికి కనీసం నెలరోజుల విశ్రాంతి అవసరమవుతుందని తెలిపాడు. కాగా, టి-20 సిరీస్ ఆరంభమయ్యేలోగా రహానే కోలుకుంటాడని ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.