రాష్ట్రీయం

కడపకు తమిళ ‘ఎర్ర’ కూలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 24: కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను నియమించి కూంబింగ్ నిర్వహిస్తున్నా కూలీలు మాత్రం శేషాచలం అడవుల్లోకి యథేచ్ఛగా చొరబడుతూనే ఉన్నారు. తమిళ ఎర్ర కూలీలు, స్మగ్లర్లు ఏకంగా తమిళనాడు, కర్ణాటక నుంచి బస్సులు, లారీల్లో శేషాచలం అడవుల్లోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి శేషాచలం అటవీ ప్రాంతంలో గువ్వలచెరువు కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై అడవుల్లోకి ప్రవేశించడానికి రెండు బస్సులు, ఒక లారీలో కూలీలు రాగా, పోలీసు, అటవీ శాఖాధికారులు సమాచారం తెలుసుకుని రెండు బస్సులు, లారీని సీజ్ చేశారు. అలాగే వాటిలో తరలిస్తున్న 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఎర్రకూలీలు, స్మగ్లర్లు పారిపోయారు. 2 బస్సులు, లారీ, 35 ఎర్రచందనం దుంగలను మాత్రమే పట్టుకోగలిగారు. కూలీలు, స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోకి పారిపోయి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు సమాచారం.
వారిని పట్టుకునేందుకు పోలీసు, అటవీ శాఖ, టాస్క్ఫోర్స్ బలగాలు గాలింపుచర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చాలా వరకూ అరికట్టామని, అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు ఏకంగా ఎర్రకూలీలు, స్మగ్లర్లు ప్రత్యేక బస్సులు, లారీల్లో వస్తుంటే ఏంచేస్తున్నారో అర్థం కావడం లేదు. సిసి కెమెరాలు, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని శేషాచలం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశామని, ఎర్ర కూలీలు, స్మగ్లర్లు అడవుల్లోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించేందుకు బేస్ క్యాంపులు సైతం ఏర్పాటు చేశామని అధికారులు చెబుతూ వస్తున్నారు. ఇంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా చొరబాటుదారులు ఏ విధంగా ప్రవేశించారో వారికే ఎరుక. ఎర్రస్మగ్లర్లు జిల్లాలో ప్రవేశించి 50 కిలోమీటర్ల మేర ప్రయాణించినా ఆ బస్సులు, లారీలను ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటన చోటు చేసుకుని 20 గంటలు గడిచినా ఆ వాహనాల్లో ప్రయాణించిన ఒక్క ఎర్ర కూలీని కూడా పోలీసులు పట్టుకోలేక పోయారంటే అనుమానాలు తలెత్తుతున్నాయి.
వందలాది మంది కూలీలు చొరబడుతుంటే బేస్ క్యాంపులు, సిసి కెమెరాలు, నిత్యం టాస్క్ఫోర్స్ కూంబింగ్, తిరుపతిలో అన్ని హంగులతో శేషాచలం అడవుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలకు అనుసంధానం చేసి డిఐజి కార్యాలయం ఏర్పాటుచేసినా టాస్క్ఫోర్స్ అధికారులు ఎందుకు పసిగట్టలేకపోయారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎర్రకూలీల వెనుక ఎవరున్నారనేది పోలీసు అధికారులు పసిగట్టాల్సి ఉంది.