నల్గొండ

కృష్ణా పుష్కరాలకు రూ. 600 కోట్లతో వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 21: జిల్లాలో కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రభుత్వ శాఖల నుండి 600కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించామని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి వెల్లంచారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌తో కలిసి కలెక్టర్ తన చాంబర్‌లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్, డిపివో, అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పుష్కర ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 20 ప్రాంతాల్లో 28పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. 160 కోట్లతో 2,562మీటర్ల పుష్కర ఘాట్ల నిర్మాణ పనులకు ప్రతిపాదించామన్నారు. 300కోట్లతో రోడ్లు, భవనాలు, షెడ్‌లు, 90కోట్లతో పంచాయతీరాజ్ రోడ్ల విస్తరణ పనులు 20కోట్లతో తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించిందన్నారు. పార్కింగ్ స్థలాల చదును కోసం ఉపాధి హామీ పథకం పనులు వినియోగించాలని డ్వామా అధికారులు సూచించామన్నారు. కేశరాజుపల్లి, పెద్దమునగాల, అజ్మాపూర్, ఉట్లపల్లి, పొట్టి చెల్మ అంజనేయ స్వామి, శివాలయం, అడవిదేవులపల్లి, ముది మాణిక్యం, ఇరికిగూడెం, వాడపల్లి, మహంకాళిగూడెం, మట్టపల్లి, బుగ్గమాధారం, వజీనేపల్లి, కిష్టాపురం, ధర్వేశిపురం, పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయంలలో కృష్ణా ఘాట్‌ల ఏర్పాట్లకు ప్రతిపాదించామన్నారు. వాటికి ప్రభుత్వ ఆమోదం లభించనుందన్నారు. గత కృష్ణా పుష్కరాల్లో వాడపల్లికి లక్షల్లో భక్తులు వచ్చినందున ఈ దఫా అందుకు మూడురెట్లు అధికంగా భక్తులు వస్తారన్న అంచనాతో తగిన ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. రాజమండ్రి పుష్కరాల్లో చోటుచేసుకున్న అపశృతులు పునరావృతం కాకుండా యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పుష్కర ఘాట్‌ల పార్కింగ్, తాగనీరు, రాకపోకల ఏర్పాట్లకు తగిన వసతులు కల్పించేలా చర్యలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌వో రవినాయక్, ఏఎస్పీ గంగారాం, జడ్పీ సిఇవో మహేందర్‌రెడ్డి, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి అంజ య్య, ఇరిగేషన్ ఎస్‌ఇ ధర్మానాయక్, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, పిఆర్ ఎస్‌ఈ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ రమణలున్నారు.