అక్షర

కపిలవాయి లింగమూర్తి కథానికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కపిలవాయి లింగమూర్తి
కథానికలు
కపిలవాయి లింగమూర్తి
కథానికలు-
వెల: రూ,25/-
సాహిత్య దుందుభి ప్రచురణ
17-110, వాణీసదనం,
నాగర్‌కర్నూలు,
మహబూబ్‌నగర్- 509209

కావ్యాలు, శతకాలు, చరిత్రలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇలా శతాధిక గ్రంథాలు వెలువరించిన సాహితీమూర్తి కపిలవాయి లింగమూర్తిగారు. 88 ఏళ్ల వయసులో కవిగా, పరిశోధకునిగా సాహిత్యకృషి చేస్తూనే వున్నారు. సుమారు యాభై సంవత్సరాల క్రితం కృష్ణాపత్రికలో ప్రచురితమైన ఆయన కథానికలను గ్రంథస్థంచేసిన డా.ఉమ్మెత్తల లక్ష్మీనారాయణ అభినందనీయులు. ఇందులో కేవలం ఆరు కథలే వున్నాయి. కొన్ని అసంపూర్తిగానూ వున్నాయి. సంకలనకర్త చొరవ తీసుకుని లింగమూర్తిగారికి జ్ఞాపకం వుంటే, ఆ ముగింపును అడిగి సంతరించి వుంటే బాగుండేది. 50-60 దశకపు ఈ కథల్లో సహజంగానే అప్పటి మధ్యతరగతి జీవన స్థితిగతులు ప్రతిబింబిస్తూంటాయి. ‘చాటువులు’ కథ చాటుబుద్ధులను గురించి రాసింది. పడుచు వయసులోని బుద్ధులను వయోధికులు కూడా అమలుపరచడం మూర్ఖత్వమని చెబుతుందీ కథ. ‘ఆగిపోయిన కథ’లో ఒకప్పటి శేఖరం, స్వాతిల పునస్సమాగమ శుభస్థితిని చిత్రించారు. స్ర్తి అంటే ఏమిటో పురుషుల పట్ల ఎలా మెలగాలో ఒక స్ర్తిచేతే చెప్పించిన కథ ‘జీవిత సంధ్యలు.’ ఈ కథల్లో సంభాషణలు, పాలమూరు నేపధ్యపు మాండలిక పదాలు, వర్ణనలు కానవస్తాయి. ఎప్పటి కథలో అయినా ఇప్పటికీ మానవ నైజాలలో మార్పురాలేదని నిరూపించే పాత్రలు వీటిల్లో కానవస్తాయి. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకున్న లింగమూర్తిగారిలోని కథకుడిని పరిచయం చేసేందుకు సంకల్పించిన ఈ పుస్తకం ఆ రికార్డును భద్రపరిచేదిగానే వుంది. ఏమయినా ఆయన వదిలిన కథామార్గాన్ని పరిచయంచేసే ఈ కూర్పు అభినందనీయం.

-ఎస్.