కృష్ణ

గెలుపోటములు ప్రధానం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: విభిన్న ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోడానికి క్రీడా పోటీలు దోహదం చేస్తాయని పార్లమెంట్ ప్యానల్ స్పీకర్, బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో ఐదురోజులు జరగనున్న దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ మహిళల టోర్నమెంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపి నారాయణరావు మాట్లాడుతూ గెలుపు ఓటములను లెక్కచేయకుండా క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. దేశ ప్రతిష్ఠతో పాటు రాష్ట్ర, జిల్లా పేరుప్రఖ్యాతలు చాటాలన్నారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతి ఆచార్య మైనేని కేశవ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య నడయాడిన క్రీడా మైదానంలో సౌత్‌జోన్ స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం ముదావహమన్నారు. విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ ఉపకులపతి ఆచార్య డి సూర్యచంద్రరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జోనల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రసిద్ధ క్రీడాకారులు ముఖేష్, క్రికెటర్ అజారుద్దీన్ వంటి క్రీడాకారులు ఈ మైదానంలో ఆడిన వారేనన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. వైకె సుందర కృష్ణ, నూజివీడు పిజి సెంటర్ స్పెషల్ ఆఫీసర్ ప్రొ. ఎంవి బసవేశ్వరరావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎన్ శ్రీనివాసరావు, కన్వీనర్ డా. సిహెచ్ జయశంకర ప్రసాద్, డా. ఎన్ ఉష, తదితరులు పాల్గొన్నారు.