అక్షర

కలం కవాతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుద్ర పురుగు, ఎర్రగాలు (వచన కవితా సంపుటాలు)
కవి: కూకట్ల తిరుపతి
వెల: రు.100, రు.80
ప్రతులకు: సాహితీ సోపతి, కరీంనగర్-505001
ఫోన్: 9949247591

‘‘ఇతని దారి వేరు. కవితా ధార వేరు. ప్రజల పలుకుబడికి పట్టం కట్టుతున్నాడు’’ అంటారు నలిమెల భాస్కర్. నిజమే తెలంగాణ కష్ట సుఖాలను ఎరిగిన తిరుపతి తెలంగాణ తెలుగులో విభిన్నంగా రాసిన కవితా సంపుటాలివి. ఆరుద్ర పురుగు ఎర్రగా ఉంటుంది (అందుకే ఆరుద్ర పేరు వచ్చిందట-కవికి). ఇప్పుడిది అంతరించిపోతోంది. వైవిధ్యానికి సొగసుకి మారుపేరు ఆరుద్ర. కాబట్టి ఒక పక్క ప్రగతిశీల భావాలకి మరోపక్క ఆత్మీయత, పల్లె సొగసులకి తన్మయుడై రాసిందే ‘ఆరుద్ర పురుగు’
‘ఐదేండ్ల కోసారి/కాలం చెట్టుకు/ ఓట్ల యిత్తనాల కార్తె/ ఉబ్బర పోత బతుకుల్ల/ ముంతా పోతవరాల వాన కురిపిస్తది/ నోట్ల పూదేనె తాపిస్తాయి/ మాటల మాణిక్యాల మూటలు/ చెవ్వుల్ల పువ్వులయి పూస్తయి’’
అని కళ్ళెర్రజేస్తాడు. ఇదే కలం-
‘‘పిల్లన గొయ్యిల పిలుపులు-కనక డప్పుల కనకనలు/ డోలుదెబ్బల మోతలు-జెగ్గుజోరు నినాదాలు/ పరవశించి పాడుతాయి’’ అనీ అనగలదు.
‘‘గోచి, గొంగడి, రుమాలే/నిత్య వస్త్రాలు/ కర్ర, కమ్మకత్తి, గొడ్డలే/వృత్తి అస్త్రాలు/ కవచకుండలముల్లా/కడగుగల దండకడియాలు’’ అనటంలో శ్రమ గౌరవం, సౌందర్యం వెల్లడించబడ్డాయి. ఈ కవి తెలంగాణలో లీనమైపోతాడు. పోరాటానికి ‘సై‘ అంటాడు. ‘వలసపోయిన పల్లె’ కోసం ఆక్రోశిస్తాడు.
‘‘అమ్ముడుపోతూనే ఉన్నది/ పాతబస్తీ పేదరికం’’
అంటూ ముస్లిం వాదులకంటే దయనీయంగా రాసిండు. ఇంత మంచి పుస్తకాల్ని కరీంనగర్ ‘సాహితీసోపతి’ ప్రచురించింది. అయితే వీటిలో వాడిన తెలంగాణ పల్లె పదాలు నేటి తెలంగాణీయులలో ఎంతమందికి తెలుసు? కొన్ని పదాలకు వివరణ ఇవ్వవలసింది.

-ద్వా.నా.శాస్ర్తీ