హైదరాబాద్

కొత్త పాలక మండలితో అక్రమార్కుల గుండెలో దడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: మహానగర పాలక సంస్థలో పాలక మండలి అధికారం చేపట్టడంతో పలు విభాగాల్లో సుదీర్ఘకాలంగా తిష్టవేసిన అక్రమార్కులైన పలువురు అధికారులకు దడ పట్టుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్లకు చట్టపరమైన నిర్ణీత అధికారాలేమీ లేవంటూ ఇదివరకున్న పాలక మండలి పెద్దలను అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇపుడు అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ పాలక మండలి పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని అధికార యంత్రాంగంలో చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. గ్రేటర్‌కు 2009లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఏ పార్టీకి సింగల్ పార్టీ మెజార్టీ దక్కకపోవటంతో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి ఒప్పందం ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్ పదవీకాలాన్ని పంచుకున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులే పైరవీకారులుగా అవతారమెత్తి ఆ రెండు పార్టీలకు చెందిన మేయర్లను అడ్డంపెట్టుకుని తమ పబ్బం గడుపుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేగాక, మొట్టమొదటి బండకార్తీక చంద్రారెడ్డి మేయర్‌గా ఉన్నపుడు ఆమె డివిజన్‌కు కౌన్సిల్ మంజూరు చేసిన పనులను సైతం ఏళ్లు గడిచినా, అంచనాలు తయారు చేయకపోవటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆ తర్వాత మజ్లిస్ మేయర్ అధికారం చేపట్టినా, పాతబస్తీ మినహా కోర్‌సిటీలో ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఈ రకంగా బల్దియా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ఉన్నపుడున్న వంద సీట్లు, ఆ తర్వాత గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత ఏర్పడిన మరో 50 సీట్లతో కలిపి మొత్తం 150 సీట్లలో ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించని రికార్డు స్థాయి సీట్లను సాధించిన టిఆర్‌ఎస్ ఏ పార్టీ మద్దతు లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ పదవిలను చేపట్టింది. అంతేగాక, తెలంగాణ వచ్చిన తర్వాత జిహెచ్‌ఎంసి మేయర్ పీఠాన్ని టిఆర్‌ఎస్ మొట్టమొదటి సారిగా కైవసం చేసుకోవటాన్ని సిఎంతో పాటు మంత్రులు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం, ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు కెటిఆర్‌కు మున్సిపల్ వ్యవహారాల శాఖను అప్పగించటం వంటి కారణాల నేపథ్యంలో జిహెచ్‌ఎంసిలో అవకతవకలు, అవినీతిని గట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న అక్రమార్కులైన అధికారులు కొందరు కాస్త వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి. ముఖ్యంగా జిహెచ్‌ఎంసిలోని ఇంజనీరింగ్ విభాగంలో కొందరు అధికారులు బినానీ పేర్లతో కన్సల్టెన్సీ సంస్థలను ఏర్పాటు చేసి ఏ అభివృద్ధి పనికైనా ఫిజిబిలిటీ టెస్టులంటూ ఏటా కోట్లాది రూపాయలను దారి మళ్లిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కట్టబెట్టినా, వారు నగరాభివృద్ధిని ప్రామాణికంగా తీసుకుని విధులు నిర్వర్తించేలా సర్కారు ప్రత్యేక విధి విధానాలను అందించాలని భావిస్తున్నట్లు సమాచారం.