కథలు రాస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రుతిహాసన్ నటిగానే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా మంచి పేరుతెచ్చుకుంది. ఆమధ్య కమల్, మోహన్‌లాల్ నటించిన ఓ తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది. ఇలా అనేక విభాగాలలో తన ప్రతిభను చూపిస్తున్న ఆమె తాజాగా కథలు రాయడానికి సిద్ధపడుతోంది. ఆ విషయం గురించి చెబుతూ కథలు రాయడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు కానీ, కథలు చెప్పడం మాత్రం బాగా వచ్చు అని అంటోంది. పెద్దయ్యాక మానేశాను కానీ చిన్నప్పుడు బోలెడు కథలు చెప్పేదాన్ని అమ్మకి. స్నేహితులకైతే మాయామంత్రాలు జోడించి మరీ చెప్పేదాన్నని, ఇప్పుడు అలాంటి కథలు చెప్పడం మానేసి సినిమాకోసమే కథలను రాయడానికి ప్రయత్నిస్తున్నానంటోంది ఈ భామ. మలయాళం నుండి రీమేక్ అవుతున్న ‘ప్రేమమ్’, సూర్యతో ఓ చిత్రంలో శ్రుతి నటిస్తోంది.