తెలంగాణ

కాందిశీకుల భూములపై హైకోర్టు తీర్పు హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: హైదరాబాద్ నగర శివారుల్లో ఉన్న కాందిశీకులు (ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లిన వారి) ఎవాక్యూ భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది.
ఈ భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని మంత్రులు, అధికారులు, పలుకుబడి కలిగిన పాలకపార్టీల నేతలు బినామీ పేర్లతో భూములను ఆక్రమించుకున్నారని, అటువంటి వారి నుంచి ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుని నిజమైన పేదలకు క్రమబద్ధీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పును అనుసరించి ప్రత్యేక యంత్రాంగాన్ని వేసి కాందిశీకుల భూములన్నింటిపై సర్వే చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోందని తెలిపారు.