రివ్యూ

కిట్టిగాడు కొట్టేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు

క్రిష్ణగాడి వీరప్రేమగాథ
తారాగణం:
నాని, మెహరీన్, మురళీ శర్మ, సంపత్‌రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు:
రామ్ ఆచంట్, గోపీచంద్ ఆచంట్, అనిల్ సుంకర
దర్శకత్వం:
హను రాఘవపూడి

భలే భలే మగాడివోయితో కమర్షియల్ మార్కెట్‌లో నిలబడిన నాని, అందాల రాక్షసితో తన మార్క్ చూపించిన హను రాఘవపూడి... వెరసి క్రిష్ణగాడి వీరప్రేమగాథ. మెహరీన్ కౌర్ హీరోయిన్‌గా 14 రీల్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. ఫ్లాట్ వైవిధ్యంగావుంటే ప్రాజెక్టు వర్కవుటైపోతున్న -రోజులివి. పాత కథకే కోటింగ్ కొత్తది వేసినా.. ప్రేమ కథను ఫార్మాట్ మార్చిచెప్పగలిగినా హిట్టు కొట్టినట్టే. ఇక సినిమాటిక్ కమర్షియల్ ఎలిమెంట్స్ దట్టించి, ఒళ్లు దగ్గరపెట్టుకుని చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఫలితాలే అందుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో -ఓ ఫ్యాక్షన్ ఎపిసోడ్, -ఓ పోలీస్ ఆఫీసర్ కథ, ఓ లవ్ స్టోరీని కలిపి వండుకుని, అభిమానులను ఆకట్టుకోడానికి నందమూరి బాలకృష్ణను డిఫరెంట్‌గా వాడుకుంటే.. -అదే క్రిష్ణగాడి వీరప్రేమగాథ.
హీరో క్రిష్ణ (నాని) నందమూరి బాలకృష్ణ అభిమాని. ముంజేతిపై జై బాలయ్య పచ్చబొట్టు వేసుకుని ధైర్యంగా తిరిగే అతి పిరికివాడు. చిన్నతనం నుంచే మహాలక్ష్మి (మెహరీన్)ని ప్రేమిస్తుంటాడు. ఫ్యాక్షన్ గొడవల్లో తలలు నరుకుతూ బిజీగా తిరిగే రామరాజు చెల్లెలు -మహాలక్ష్మి. పగ, ప్రతీకారాలే జీవిత ధ్యేయంగా బతికే అబ్బిరెడ్డి, రాజన్నల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలు క్రిష్ణగాడి ప్రేమకథను తాకి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అసలు ఫ్యాక్షన్ గొడవలకు, క్రిష్ణ ప్రేమ కథకు సంబంధమేమిటి? ఫ్యాక్షన్ గొడవలోకి మాఫియాడాన్ (మురళీ శర్మ) ఎందుకొచ్చాడు? ఏసీపీ శ్రీకాంత్ (సంపత్‌రాజ్) పిల్లల కిడ్నాప్ కథేంటి? వాళ్లను కాపాడేందుకు పిరికి క్రిష్ణ ఎలాంటి ధైర్యసాహసాలు ప్రదర్శించాడు? ప్రేమను దక్కించుకున్నాడా? లేదా?లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.
నాని బ్రాండ్ యాక్టింగ్‌తో మరో గోల్‌కొట్టాడు. బాలయ్య వీరాభిమానిగా, ప్రతి చిన్న విషయానికీ భయపడే కంగారోడిగా, అపరవీర ప్రేమికుడిగా.. ఇలా రకరకాల షేడ్స్ పలికించాల్సిన పాత్రలో రాణించాడు. హీరోయిన్ మెహరీన్ అందం, అభినయం ప్రాజెక్టుకు ఒక ప్లస్ అయితే, ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు బోనస్. కీలక పాత్రల్లో కనిపించిన ముగ్గురు చిన్నారులు బేబీ నయన, మాస్టర్ ప్రథమ్, బేబీ మోక్షలు అదనపు బలమయ్యాడు. నాని, సత్యం రాజేష్‌ల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు నవ్వించాయి. సంపత్‌రాజ్, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, మురళీశర్మ ఇలా ప్రధాన పాత్రలంతా సినిమాకు మరింత బలాన్నిచ్చాయి.
సాంకేతిక అంశాల్లో తొలుత ప్రస్తావించాల్సింది దర్శకుడు హను రాఘవపూడిని. మొదటి సినిమా అందాల రాక్షసితోనే తన మార్కు చూపించిన హను, రెండో సినిమాకు మరింత సెన్సిబిలిటీని జోడించాడు. రచయితగానూ సక్సెస్ అయ్యాడు. సెకెండాఫ్‌పై మరింత శ్రద్ధపెట్టివుంటే -రిజల్ట్ మరోలా ఉండిఉండేది. విశాల్ చంద్రశేఖర్ అందించిన బాణీలు, బ్యాగ్రౌండ్ బావుంది. సినిమాటోగ్రఫీలో యువరాజు అద్భుత ప్రతిభ కనబర్చాడు. ఆర్ట్ డైరెక్షన్, పాటల్లో సాహిత్యం.. ఇలా టెక్నికల్‌గా అందరూ తమవంతు న్యాయం చేశారు. ఎడిటింగ్‌పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫస్ట్ఫా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్‌లు బావున్నాయి. సెకెండాఫ్‌లో పిల్లలతో కలిసి నాని చేసే జర్నీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ల్లో ఎమోషన్స్ పండాయి. అయితే, సినిమా అసలు కథంతా ఫస్ట్ఫాలోనే చెప్పేయడం మైనస్ పాయింట్ అయ్యింది. ముందే తెలిసిన సింగిల్ పాయింట్ చుట్టూ సెకెండాఫ్ తిరగడం కొంచెం బోర్ అనిపించింది. దానికితోడు ఆసక్తికరమైన అంశాలు లేకపోవడం, స్లోనేరేషన్ ఆసక్తికి తగ్గిస్తాయి. నాని నటనలో రొటీన్ టచ్ విసిగిస్తే, హను రాఘవపూడి లవ్‌స్టోరీని నడిపించిన తీరు అందాల రాక్షసిని గుర్తు చేసేలా ఉంది. ఫస్ట్ఫాలో లెంగ్త్ ఎక్కువ. సెకెండాఫ్‌లోని రెండు పాటలూ అసందర్భం ఒకఎత్తయితే, ఎమోషన్‌ను పక్కదారి పట్టించేలా ఉండటం -క్రిష్ణగాడి వీరప్రేమగాథ స్థాయిని దించేసినట్టయ్యింది.

- శ్రీను