సబ్ ఫీచర్

కల్తీ నూనెలతో పొంచివున్న ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల వంటనూనెల్లో కల్తీ అనే మాట ప్రతినోట వినిపిస్తోంది. వాటిని ఆరగిస్తే ఆరోగ్యం ఆ వంటనూనె మంటలో కలిసిపోవడం ఖాయం. ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో అధిక ధర ఉండే వంటనూనెతో చౌకరకాల నూనె కలపడం లేదా పశువుల కొమ్ములు, ఎముకలు కరిగించి తీసిన నూనెను సాధారణ నూనెలో కలపడం జరుగుతున్నది. కాబట్టి వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న నూనె ఎంత స్వచ్ఛమైనదో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. ఎందుకంటే కేవలం ఒకానొక ప్రాచుర్యం పొందిన బ్రాండ్ వంట నూనెల ప్లాంట్‌లోకి వచ్చిన ట్యాంకర్లను పరిశీలిస్తే యదేచ్ఛగా కల్తీ నూనెల బండారం బయటపడింది. ఇక ఊరూరా చిన్న ప్రైవేటు వ్యాపారులు విచ్చలవిడిగా కల్తీ నూనెల్ని ప్యాకెట్లలో అందంగా ఉన్న వాటిల్లో నింపి తక్కువ ధరకు అమ్మేస్తున్నారనడం అతిశయోక్తి కాదు. నూనెల వినియోగం అధికంగా ఉన్న నూనె గింజల దిగుమతి మాత్రం అంతంత మాత్రమే. గత ఏడాది కాలంగా ఈ కల్తీనూనెల్ని పరిశీలిస్తే దాదాపుగా 25 లక్షల కిలోల వంటనూనె కల్తీ గుర్తించారంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కల్తీ నూనెల్లో కొవ్వులు అధికం. వాటిని తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు కూడా వస్తాయి. అలాగే అజీర్ణం, తలనొప్పి, కడుపునొప్పి, కాలేయం దెబ్బతినడం, అలాగే వేపుళ్లు చేస్తే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు జీర్ణశక్తి తగ్గిపోవడం, కడుపులో మంట, దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తాయి కాబట్టి ప్రముఖ బ్రాండ్ల వంటనూనెలు వాడటమే శ్రేయస్కరం. ఇలాంటి కల్తీ నూనెల వాడకాన్ని ఆహార భద్రతా విభాగం అధికార్లు తనిఖీల ద్వారా నివారించాలి. కానీ తనిఖీలు ఏవీ? అసలు ఈ విభాగాల్లో తగినంతమంది సిబ్బంది లేరు. ఇలాంటి వాటిని నిరోధించడానికి 30 పోస్టులకు ముగ్గురే పనిచేస్తున్నారంటే ఎలా? ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రతి 50వేల మంది జనాభాకు ఒక అధికారి ఉండాలి. ఇలా అయితే ఒక్క హైదారాబాద్‌లోనే 200 మంది అధికార్లు అవసరం. కాబట్టి ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలి. ముఖ్యంగా కల్తీ చేసేవారు పామాయిల్‌ను మరో నూనెతో కలిపి వనస్పతిగా మార్చేందుకు హైడ్రోజన్ వాయువును పంపుతారు. లేదా నెయ్యితో వనస్పతిని కలిపి కల్తీ చేస్తారు. లాభార్జన కోసం వ్యాపారులు ఎన్నో అడ్డదారులు తొక్కుతుంటారు. ఇవేమీ తెలియని సామాన్య జనం రంగురంగుల ప్యాకెట్లలోని నూనెను చూసి తక్కువ ధరకు ఇస్తున్న కొత్త కంపెనీల నూనెను కొని మోసపోవడమే కాకుండా విలువైన ఆరోగ్యాన్ని కూడా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు పరిశీలించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక అధికారులతో దొంగతనంగా కల్తీ నూనెలు సరఫరా చేస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేయాలి.

- ఈవేమన