తెలంగాణ

కోటి మంది భక్తులు విడిదిచేసే వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, ఫిబ్రవరి 15: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతరకు కోటిన్నర మంది భక్తజనులు రానున్నారు. ఇందుకు తెలంగాణా ప్రభుత్వం 181 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టింది. తెలంగాణా రాష్ట్రం నుండే కాకుండా ఛత్తీస్‌ఘడ్, మద్యప్రదేశ్, మహారాష్ట్ర, ఓరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు మేడారం తరలివస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల భక్తులు ముందుగా మేడారం చేరుకొని గుడారాలు ఎర్పాటు చేసుకున్నారు. ఈనెల 17 నుండి 18 వరకూ కోటి మంది భక్తులు మేడారం చేరుకొని తమ ఇష్టాదైవాలైనా తల్లులను కొలువనున్నారు. కోటి మంది భక్తులు విడిది చేయనుండటంతో మేడారం జనసంద్రంగా మారనుంది. ఇంత మంది భక్తులు ఓకే చోట మూడురోజుల పాటు ఉండి తమ దైవాలను కొలవడం చరిత్ర పుటలలో నిలవడం మేడారం ప్రదాన్యతను తెలుపుతుంది. ఏది ఏమైనా మేడారం జాతరంటే ఓ ఆద్భుతమైన, ఆద్వీతీయమైన ఘట్టం. ఇందుకోసమే దేశవిదేశాల నుండి.. ఇతర రాష్ట్రాల నుండి భక్తులు మేడారం జాతరకు తరలివస్తున్నారు.