ఖమ్మం

నాడు వర్గపోరు.. నేడు నేతలే లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మే 20: గతంలో తెలుగుదేశానికి రాష్ట్రంలోనే అత్యంత బలమైన కార్యకర్తలు ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. జిల్లాలో అత్యధికమంది కార్యకర్తలు, నాయకులు కలిగి అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నాయకులలేమితో అల్లాడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు వహించిన నేత ఒకరు కాగా, ఒకరు పార్టీని నడిపించేందుకు శ్రమించిన నాయకుడు. ఇద్దరు నాయకులు పార్టీలో ఉన్నప్పుడు వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీంతో 2014 ఎన్నికల్లో ఒకరిని ఓడించుకునేందుకు ఒకరు కృషి చేసినట్లు ఆ నేతల అనుచరులే బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు నేతల తీరును చూసి అంతర్మథనంలోకి వెళ్ళారు. 2014 ఎన్నికల తర్వాత ఆ పార్టీ ప్రధాన నేత అయిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడడంతో జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. మండల, జిల్లా నాయకులతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడే తుమ్మలతో కలిసి పార్టీని వీడడంతో పార్టీని నడిపించే నాయకుడు లేకుండాపోయాడు. ఉన్న కార్యకర్తలను కాపాడుకునేందుకు సరైన నాయకుడు లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు నిస్తేజంలోకి వెళ్ళారు. తుమ్మల పార్టీని వీడిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో టిడిపి నాయకులు తమ సత్తాచాటలేకపోయారు. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చిన టిడిపి కార్పొరేషన్ ఎన్నికల్లో స్వయంగా 50 డివిజన్లకు గాను 48 డివిజన్‌లలో పోటీ చేసింది. ఒకటిరెండు డివిజన్‌లలో మినహా ఏ డివిజన్‌లో గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. ఇటీవల జరిగిన పాలేరు ఉప ఎన్నికలో సైతం సాంప్రదాయం అంటూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పలువురు కార్యకర్తలు తీవ్ర అసహనానికిలోనయ్యారు. 2014 ఎన్నికల్లో టిడిపి వెంట ఉన్న కార్యకర్తలు ప్రస్తుత పొత్తులను చూసి పార్టీని వీడినట్లు పలువురు నేతలు, కార్యక్తరలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా నాయకత్వం సైతం ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడం, వారికి ధైర్యం చెప్పడంలో విఫలమవుతోంది.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న రెండో మినీ మహానాడు ఈ నెల 21వ తేదీన ఖమ్మంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నామ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్యల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహానాడు నిస్తేజంలో ఉన్న కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నారు. పలు కీలక తీర్మానాలతో పాటు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు మహానాడు దోహదపడుతుందని పార్టీ సీనియర్ నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.