భక్తి కథలు

ఆచారాలను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజులు సమాజ శ్రేయస్సుకోసం యజ్ఞాలు, యాగాలు చేసేవారు. తత్ఫలితంగా ఆ రాజ్యాలలో కరువు కాటకాలు లేకుండా సస్యశ్యామలంగా వుండేది.రాజు సత్పురుషుడుగా ఉండేవాడు. ఒకవేళ రాజుల్లో అపమార్గాలు కనిపిస్తే ఋషులు వానిని బాగుపరిచేవారు. దీనివల్ల ప్రజల్లో అహింసావాదం పెరిగేది. సత్యం, ధర్మం, దానం, శాంతి మొదలగు గుణాలు పెరిగేవి. ఎక్కడా హింస, అతివృష్టి, అనావృష్టి క్షామం అంతగా కనిపించేవి కావు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేవారు.
కానీ నేడు పాశ్చాత్య ధోరణి వల్ల ప్రజలలో ఆధ్యాత్మిక చింతన సన్నగిల్లుతుంది. ఒకవేళ ఉన్నా అది ఆర్భాటంగా సాగుతోంది. భక్తి కూడా వ్యాపారం లాగా భావిస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు జోరుగా సాగుతున్నాయ. ప్రజల్లో చాలామంది శాంతి లేక సతమతవౌతున్నారు. మనిషి లో స్వార్థం పెరిగింది. రాను రాను స్వార్థపూరితుడై పక్కవాడిని కొట్టి తాను బాగుపడాలనుకొంటున్నాడు. అందుకే సమసమాజం కాదుకదా ఎక్కడ చూసినా హత్యలు ఆత్మహత్యలు కనబడుతున్నాయ.
దీనికి కారణం ధర్మ నశించడమే. ధర్మం ఆచరిస్తే నే సత్యం పలికితేనే సమసమాజం వస్తుంది. ప్రజలంతా సమానులు సమాన న్యాయం వస్తుంది. మన ఆచార వ్యవహారాలను, హైందవ ధర్మాలను వదిలేస్తూ నాగరికత మోహంలో పడిపోతున్నారు. దీనివల్ల కొంతకాలానికి మనదైన సంప్రదాయాలు, ధర్మాలు, ఆచారాలు, విలువలు, జ్ఞానం అన్ని శాశ్వతంగా మరుగున పడిపోతాయి అప్పుడు వ్యక్తి, తద్వారా సమాజం కళాహీనం అవుతుంది. ప్రజలలో పాపభీతి, భక్తి, ధర్మం నశించిపోతాయి. ప్రజలు సంస్కారరహితులుగా మారిపోతారు.
ఇట్లాకాకుండా ఉండాలంటే వ్యక్తుల ఆలోచనల్లో మార్పు రావాలి. సత్యానికి కున్న బలం తెలుసుకోవాలి. మన పూర్వపద్ధతులు తెలుసుకొని వాటిల్లో ఉండే విలువలు శాస్తజ్ఞ్రానం తెలుసుకొని వాటిని ఆచరించాలి. ఆచరింపచేయాలి. అపుడే తిరిగి సత్యధర్మాచరణ చేసేవారు తయారు అవుతారు.
పాశ్చాత్యులను అనుకరించకుండా మన దేశ శీతోష్ణస్థితులకు అనువుగా మనలను మనం తీర్చిదిద్దుకోవాలి. తెల్ల జామునే నిత్యకృత్యం తరువాత ఇష్టదైవాన్ని స్మరిస్తూ పూజా, జపతపాదులు కావించడం కనీస ధర్మాలు. మనకున్నంతలో ఇతరులకు దానం చేయడం మన అలవాటు. అది నిత్యకృత్యంగా చేసుకోవాలి. కొన్ని ప్రత్యేక పర్వదినాలలో పండుగలలో కుటుంబ సమేతంగా దగ్గరలోని మందిరాలను సందర్శించి తమ క్షేమానికే కాక తమ ఇరుగు పొరుగు, తమ చుట్టూ వున్న సమాజం కోసం కూడా ప్రార్థించాలి. ఆయా కాలాలలో పాటించాల్సిన నియమాలను కచ్చితంగా పాటించాలి. బ్రహ్మీ ముహూర్తాన లేచి కాలకృత్యాల తరువాత కనీసం ఒక గంటన్నర చదువుకోవాలి ఇది ప్రతీ విద్యార్థి కనీస ధర్మం లేదా కర్తవ్యం. ప్రతిరోజు చదువుకుంటే పరీక్షాసమయాల్లో ఆవేదన చెందాల్సిన అవసరం ఉండదు. ఏకాలానికి ఏ పని చేయాలో ముందుగానే ఆలోచించుకుని ఆ పనిని చేయాలి. వీటన్నింటినీ చేయాలి అంటే ముందుగా మనకు సమయపాలన చేయగలగాలి. దినచర్యను ప్రణాళికాబద్ధం చేసుకోవాలి.
ముందుగా ప్రతివారిని ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాలి. అందరినీ సమబుద్ధితో చూడగలగాలి అపుడేఅసమానతలు నశిస్తాయ. సమానత వస్తుంది. సౌహార్ర్ద్భావం విల్లి విరుస్తుంది.

- సాయ కృష్ణ