జాతీయ వార్తలు

‘కబాలి’ విడుదలకు హైకోర్టు పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కోర్టు వివాదాలను అధిగమించి ‘కబాలి’ సినిమా రేపు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ శుక్ర ఫిలింస్ భాగస్వామి ఆర్. మహాప్రభు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు గురువారం కొట్టివేసింది. ‘కబాలి’ విడుదలకు న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రజనీ నటించిన ‘లింగ’ సినిమాను విడుదల చేసి తాను తీవ్రంగా నష్టపోయానని, తనకు నష్టపరిహారం ఇచ్చేవరకూ ‘కబాలి’ని విడుదల చేయరాదని మహాప్రభు కోర్టును ఆశ్రయించారు. 89 లక్షల రూపాయల మేరకు నష్టాన్ని భర్తీ చేస్తామని ‘లింగ’ నిర్మాతతో పాటు రజనీకాంత్ తనకు హామీ ఇచ్చారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘లింగ’ ఉదంతాన్ని ‘కబాలి’ విడుదలతో ముడిపెట్టలేమని, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకున్న తరుణంలో ఒకరోజు ముందు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ‘కబాలి’ విడుదలకు లైన్ క్లియర్ అయింది.