అంతర్జాతీయం

కాబూల్ పేలుళ్లలో ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, డిసెంబర్ 12: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రాయబారుల క్వార్టర్స్‌లోని స్పెయిన్ ఎంబసీ వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో నలుగురు ఆఫ్గన్ పోలీసులు, ఇద్దరు స్పానిష్ అధికారులు మృతి చెందారు. తాలిబన్ ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కొన్ని గంటలపాటు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అత్యంత భద్రత ఉండే ఆ ప్రాంతం బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ‘నలుగురు ఆఫ్గనిస్తాన్ పోలీసులు, ఇద్దరు విదేశీయులు, నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు’ అని కాబూల్ క్రిమినల్ ఇనె్వస్టిగేషన్ శాఖ అధిపతి ఫ్రైదూన్ ఒబైదీ వెల్లడించారు. కారు బాంబు పేలుళ్లలో తమ దేశీయులు ఇద్దరు మరణించినట్టు మాడ్రిడ్ ప్రభుత్వం తెలిపింది. రాయబారుల కాలనీలో అత్యంత శక్తివంతమైన బాంబు పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. శుక్రవారం రాత్రంతా పేలుళ్లు సంభవిస్తునే ఉన్నాయి.
శనివారం తెల్లవారుజామున భద్రతాదళాల దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారని ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ అతిధి గృహంపై జరిగిన దాడి తమ పనేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. తొలుత స్పానిష్ ప్రధాని మరియానో రజోయ్ ఓ ప్రకటన చేస్తూ తమ ఎంబసీ సమీపంలో దాడి జరిగింది తప్ప ప్రాంగణంలో కాదని అన్నారు. ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు ఘనీ మూడు రోజుల క్రితం పాక్ అధికారిక పర్యటనకు వెళ్లి వచ్చిన తరువాత తాలిబన్‌లు దాడికి తెగబడ్డారు.