అంతర్జాతీయం

కాబూల్‌లో మళ్లీ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్:ఆఫ్గానిస్తాన్ కాబూల్‌లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధానిలోని రక్షణ కార్యాలయంపై జంటపేలుళ్లకు పాల్పడి భారీ ప్రాణనష్టం కలుగజేసి 24 గంటలు గడవకముందే మంగళవారం ఉదయం మరోసారి కాల్పులకు తెగబడ్డారు. నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలోకి జొరబడిన ఇద్దరు తీవ్రవాదులు కాల్పులు జరిపారు. వీరిలో ఒకరిని భద్రతాదళలాలు మట్టుబెట్టగా మరొకరిని అదుపులోకి తీసుకున్నాయి. తాలిబన్ తీవ్రవాదులు సోమవారం జరిపిన జంట పేలుళ్లలో 28మంది ప్రాణాలు కోల్పోగా వందమందివరకు గాయపడిన సంగతి తెలిసిందే.