AADIVAVRAM - Others

నిజమైన శక్తి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓ ఐస్‌క్రీం కొనుక్కోరా!’ అని అమ్మమ్మ రాజుకి ఓ వంద కాగితం ఇచ్చింది.
రాజుకి వంద నోటు చూడగానే ఎలా ఖర్చు చేయాలో తెలియలేదు. ఏం చేద్దామా అని ఆలోచించాడు కాసేపు. వాడికి తిండి మీద కంటే ఆటల మీద ధ్యాస. ఆటలంటే అంత ఇష్టం. వంద నోటు జేబులో పెట్టుకుని పార్క్‌కి పరుగెత్తాడు. అక్కడ కాసేపు ఆడుకొని, టాయ్ ట్రైన్, మినీ జైంట్ వీల్ ఎక్కాలని ప్లాన్ వేసుకున్నాడు. పార్క్ గేటు వద్ద వాచ్‌మేన్ ఆపాడు. ‘టిక్కెట్ తీసుకొని రా...’ గట్టిగానే చెప్పాడు.
టికెట్ కౌంటర్ దగ్గర బాగా రష్‌గా ఉంది. తన ఎత్తుకి కౌంటర్‌లో వున్నతను కనపడలేదు. ‘వన్ టికెట్ ప్లీజ్!’ గట్టిగా అరిచాడు.
‘చిల్లర లేదు. ఐదు రూపాయలు చిల్లర పట్టుకుని రా... ఫో!’ అని గదమాయించాడు టికెట్ ఇచ్చే అతను.
రాజు బిక్కమొహం వేశాడు. చిల్లర తెచ్చి ఇంత క్యూలో మళ్లీ రావాలా - బాధపడ్డాడు. గేటు కీపర్ దగ్గరికి వెళ్లి ‘చిల్లర ఇస్తావా..’ అని దీనంగా అడిగాడు.
‘నా దగ్గర లేదు. ఎవరినైనా అడుగు!’ తన టికెట్లు చింపుకొనే పనిలో పడిపోయాడతను. అక్కడ వున్న వాళ్లు కూడా ఎవ్వరూ చిల్లర ఇవ్వలేదు.
అప్పుడే టికెట్ తీసుకొని వస్తున్న ఓ తాతగారు ‘బాబూ! ఇలారా! నీకూ టికెట్ తీసుకొన్నానులే.. ఇక్కడ వందకి చిల్లర ఎవ్వరూ ఇవ్వరు. పద’ అని గేటు దగ్గరే వున్న రాజుని వాళ్ల మనవళ్లతోపాటూ తీసుకెళ్లాడు.
రాజుకి కాస్త నామోషీ అనిపించింది. కానీ లోపల ఆడుకోవాలనే ఆదుర్దా. ‘్థంక్స్ తాతగారూ’ అంటూ లోపలికి పోగానే పరుగెట్టి హాయిగా ఆడుకొన్నాడు.
ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి మినీ జైంట్ వీల్ ఎక్కాడు. ఇక ఆడిఆడి అలసట వచ్చిన రాజు ఐస్‌క్రీం కొనుక్కొని తిన్నాడు. అమ్మమ్మ ఇంటికి వెళ్లగానే లెఖ్ఖ అడుగుతుంది. తను ఎంత ఖర్చు చేసినదీ, మిగిలినది ఎంత అప్పజెప్పాలో తేల్చుకుంటూ వెళ్తూంటే - తన కోసం టికెట్ కొన్న తాతయ్య గుర్తు వచ్చాడు. తాతయ్య చేత ఖర్చు పెట్టించకూడదు కదా అనుకొని ఆయన కోసం పార్క్ అంతా వెతికి పట్టుకున్నాడు రాజు. రాజు జేబులోంచి ఐదు రూపాయలు చిల్లర తీసి ఆ తాతయ్యకి ఇవ్వబోయాడు.
ఆ పెద్దకళ్ల తాతయ్య - రాజు భుజం మీద చెయ్యి వేసి ‘్ఫర్లేదు రా... నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు. అవకాశం దొరికినపుడు నువ్వూ మరెవరికైనా సాయం చెయ్యి!’ అని చెప్పి వాళ్ల మనవళ్లతో ఆడుకోసాగాడు.
రాజుకి ఆయన చెప్పిన దానిలో అంతరార్థం తెలియలేదు. మరుసటి రోజు స్కూల్‌కి వెళ్లినపుడు రాజు హెడ్‌మాస్టర్‌గారి రూమ్ దగ్గర ఉన్న నోటీసు బోర్డు మీద రాసి వున్న సూక్తి శ్రద్ధగా చదివాడు.
‘నిజమైన శక్తి డబ్బులో లేదు; మనం చేసే మంచి పనులలోనూ, పవిత్రతలోనూ ఉంది - వివేకానంద’
‘ఓహో!’ అనుకున్నాడు రాజు. అర్థమైంది వాడికి. ‘డబ్బు కలిగి ఉండడం గొప్పకాదు. మంచితనమే నిజమైన ధనం. ఇతరులకు సాయపడాలి. మంచి పనులు చేయాలి. పవిత్రమైన మనసుతో మంచి పనులు చేయాలి. డబ్బుకంటే అదే విలువైనది’
పార్క్‌లో తాతయ్య చెప్పిన దానికి అర్థం ఇది కదా అని తలూపుకుంటూ క్లాస్‌లోకి పరుగెట్టుకెళ్లాడు రాజు.

-బీవీఎస్ ప్రసాద్