సాహితి

ఆంధ్రభూమి కథల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహితికి
తన వంతు తోడ్పాటుగా
మీ అభిమాన దినపత్రిక
ఆంధ్రభూమి ఎప్పటిలాగే
ఈ సంవత్సరమూ
కథల పోటీ
నిర్వహిస్తున్నది.

* ఈ కాలపు జీవితానికి, ఈ తరం అభిరుచులకు, మారుతున్న విలువలకు అద్దంపట్టే
రచనలకు స్వాగతం. హాస్యమా, శృంగారమా, క్రైమా, మరొకటా అన్నది మీకే
వదులుతున్నాం. ఇతివృత్తం మీ ఇష్టం. భాషలో, శైలిలో, శిల్పంలో కొత్తదనానికి ప్రాధాన్యం.
వృద్ధాప్యంలో పిల్లల నిరాదరణ, అత్తల ఆరళ్లు, కోడళ్ల కుత్సితం, శ్రోత్రియుల చాదస్తం లాంటి
అరిగిపోయిన ప్లాట్లు అసలొద్దు.
* కథ నిడివి ఆదివారం అనుబంధంలో, భూమికలో కథకిచ్చే చోటుకు సరిపోయేలా ఉండాలి.
మామూలు దస్తూరిలో 6నుంచి 8 పేజీలు రాస్తే చాలు. (డిటిపి చేసి పంపితే ఎ4 సైజులో 3-4
పేజీలు). నిడివి మరీ ఎక్కువయితే రచన ఎంత బాగున్నా పరిశీలించము.
* రచన మొదట్లోనూ, చివరనా రచయిత పేరు (కలం పేరు వాడితే అసలు పేరు), చిరునామా,
ఫోన్ నెంబర్, (ఉంటే ఇ-మెయిల్ ఐడి) స్పష్టంగా రాయాలి. కాగితానికి ఒకవైపే రాయాలి.
ఇష్టమైతే ఫోటోకూడా పంపవచ్చు.
* రచన తమ సొంతమని, దేనికీ అనుకరణ, అనుసరణ లేక అనువాదం కాదని,
మరే పత్రికకు గాని, వెబ్ మాగజైన్‌కు గాని, బ్లాగుకు గాని పంపలేదని, ఇంకే పోటీలోనూ
పరిశీలనలో లేదని హామీ పత్రం సంతకం చేసి తప్పనిసరిగా జతపరచాలి.
* లోగడ ఆంధ్రభూమి దిన, వార, మాస పత్రికలకు పంపితే తిరిగొచ్చిన రచనలు మళ్ళీ
పంపకూడదు. వేరే పత్రికకుగాని, వెబ్ మాగజైనుకుగాని, బ్లాగుకు కాని, మరేదైనా సంస్థ
నిర్వహించే పోటీకిగాని పంపిన రచనను మళ్లీ ఈ పోటీకి పంపటం అనైతికం, నేరం.
* జిరాక్స్ కాపీలు పరిశీలించడం కుదరదు.
రచనలను పిడిఎఫ్ పార్మాట్‌లో ఇ-మెయిల్ ద్వారా
abcontest@deccanmail.com కూడా పంపవచ్చు.
* బహుమతి పొందిన రచనలను ఆంధ్రభూమి దినపత్రిక, ఆదివారం అనుబంధం,
భూమిక సప్లిమెంట్‌లో ప్రచురిస్తాము.
* బహుమతి పొందని రచనలలో ఎంపిక చేసిన వాటిని సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాము.
వాటిని భూమికలో గాని, ఆదివారం అనుబంధంలో గాని, ఆంధ్రభూమి వార, మాస
పత్రికల్లోగాని వీలువెంబడి, మా ఇష్టాన్నిబట్టి ప్రచురించవచ్చు.
* సాధారణ ప్రచురణకు కూడా స్వీకరించని రచనలను తిప్పి పంపాలంటే తగిన స్టాంపులను
అతికించి చిరునామా రాసిన కవరును జతపరచాలి. స్టాంపులు, కవరు విడివిడిగా
పంపితే గల్లంతు కావచ్చు.
* పోటీకి సంబంధించిన అన్ని అంశాలమీద సంపాదకుడిదే తుది నిర్ణయం.
దీనిపై ఉత్తరప్రత్యుత్తరాలు కుదరవు.

మొదటి బహుమతి
రూ. 10,000

రెండో బహుమతి
రూ. 5,000

మూడో బహుమతి (2)
రూ. 3,000

ప్రత్యేక బహుమతి (2)
రూ. 2,000

కవరు మీద
‘కథల పోటీకి’ అని
తప్పనిసరిగా రాయాలి.

ఎడిటర్
ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్,
సికిందరాబాద్- 500 003.

కథలు మాకు చేరడానికి
ఆఖరు తేది

31 జనవరి 2016

abcontest@deccanmail.com