రాష్ట్రీయం

ప్రతిపక్షాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం చెప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
యాదగిరిగుట్ట, నవంబర్ 28: వరంగల్ ప్రజలు మంచి చైతన్యవంతులని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు సరైన గుణపాఠం చెప్పారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి వారిని శనివారం ఆయన దర్శంచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కుంబ సభ్యులతో యాదాద్రికి విచ్చేసిన కడియం అంతకుముందు ఆలయంలో తన మనవరాలికి అన్నప్రాసన కార్యక్రమం చేపట్టారు. ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచామనడం అనైతికమన్నారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ప్రతిపక్షాలు పనికట్టుకుని తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు వారిని విశ్వసించలేదన్నారు. ఇదిలావుండగా, రైతులకు 1700 కోట్ల పంట రుణాలు మాఫీచేశామని చెప్పారు. పత్తికి మద్దతు ధర ప్రకటించడంలో కేంద్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. దేశంలో మోదీ హవా పలచబడిందని, ఇందుకు ఢిల్లీ, బిహార్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణని ఆయన అన్నారు. ఇదిలావుండగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్‌కు తమ ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చుబెడుతుందన్నారు. త్వరలో డిఎస్సీ ప్రకటించనున్నామని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నామన్నారు. ఉపముఖ్యమంత్రికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ గొంగిడి సునితామహెందర్ రెడ్డి, గుట్ట జడ్‌పిటిసి కర్రె కమలమ్మ వెంకటయ్య, ఎంపిపి గడ్డమిది స్వప్న రవిందర్‌గౌడ్, గుట్ట సర్పంచి బూడిద స్వామి, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని అంజనేయులు నాయకులు కీసరి బాల్‌రాజు, దామోదర్, అంకం నర్సింహ్మ స్వాగతం పలికారు.

జూన్ నాటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద సాగునీరు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 28:వేములవాడ, ధర్మపురి నియోజక వర్గాలకు జూన్ నాటికి ఖరీఫ్ ద్వారా సాగునీరు అందించనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. 230 కోట్ల రూపాయల వ్యయంతో వేములవాడ నియోజక వర్గంలోని ఖతల పూర్, మెడిపల్లి మండలంలోని 44వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం డిపిఆర్ తయారు చేయాలని చెప్పారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల్లో భూ సేకరణ సమస్యలు, సహాయ పునరావాస సమస్యల పరిష్కారానికి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, చొప్పదండి ఎమ్మెల్యే బుడిగె శోభలతో పాటు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇఎన్‌సి మురళీధర్‌రావు, కరీంనగర్ సిఇ అనిల్ కుమార్, ఎస్‌ఇ వెంకటేశ్వర్లు ఉన్నారు. ప్రతి నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు సమీక్షించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద జూన్ ఖరీఫ్ పంట కాలానికి సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భూ సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్న చోట జివో 123 ప్రకారం భూ సేకరణ చేయాలని సూచించారు. చొప్పదండి నియోజక వర్గంలోని చర్లపల్లి, గుండెనపల్లి, కొనపూర్ గ్రామాలను ముంపు నుండి తప్పించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. భూ సేకరణ కోసం ఎంపి, ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని సూచించారు.