తమిళ టెంపర్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అందాల భామ కాజల్‌కు ఇప్పుడు అవకాశాలు కూడా క్యూ కట్టాయి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈమెకు తాజాగా తమిళంలో క్రేజీ అవకాశం దక్కింది. ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. శింబు హీరోగా నటించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజలే ఎంపికైందట. ఎన్టీఆర్ విభిన్న పాత్రతో కరెప్టెడ్ పోలీసుగా ఈ చిత్రంతో ఆకట్టుకున్నాడు. పూరీ జగన్నాధ్ మార్క్ స్టైల్ మేకింగ్‌తో రూపొందిన ఈ చిత్రానికి తమిళ్‌లో విజయ్‌చందర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పోషించిన పాత్రను ఏ మాత్రం మార్పు లేకుండా అలాగే ఉంటుందట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది.