అక్షర

కనువిప్పు కలిగించే ‘కాకి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డాక్టర్ కాకి’
మంజులూరి కృష్ణకుమారి
వెల యాభై రూపాయలు.
పుస్తకాలకు చినుకు పబ్లికేషన్స్, 36-7-11, గరికపల్లివారి వీధి, గాంధీనగర్,
విజయవాడ-520 003

చక్కటి ఆలోచనా ఆలోచనలకు మంచి అక్షర రూపం ఇచ్చే సామర్ధ్యం, కథ చెప్పే విధానం, ఇవన్నీ సమపాళ్లలో కలగలిపితేనే గొప్ప కథ పురుడు పోసుకుంటుంది. అందులోను పిల్లలకి కథ చెప్పాలంటే ఎలా చెబితే వాళ్లకు అర్థమవుతుందో, ఆనందిస్తారో, ఆలోచిస్తారో ఆ విధంగా చెప్పగలగడం చాలా కొద్దిమంది బాలసాహిత్య రచయితలు చెయ్య గలుగుతున్నారు. పిల్లల రచనలు చెయ్యడంలో చాలామంది పిల్లలని ఆకట్టుకోలేక పోవడానికి కారణం, పిల్లలు మాట్లాడుకునే భాషలోనే వారికర్థమయ్యే విధంగా, కథ చెప్పకపోవడమే కారణం. పిల్లల మనసును పట్టుకుని కథలోకి వాళ్లని తీసుకెళ్లే చాకచక్యం లేకపోవడమే కారణమమవుతుంది. అందుకే పిల్లల కథలు, పిల్లల నవలలు రాయడం మరీ కష్టం. పిల్లల భాషమీద వారి భావాల మీద బాగా అవగాహన గల రచయిత మాత్రమే ఆ పని చెయ్యగలరు. మంజులూరి కృష్ణకుమారిగారు ఆ పట్టుని సాధించిన రచయిత్రి. ఆమెకి ‘చిన్నారి’ పత్రిక, ఆకాశవాణి ఉద్యోగం కూడా బాగా కలిసొచ్చింది. ఆ వాతావరణం ఆమె రచనా వ్యాసంగానికి బాగా తోడ్పడింది. పంచతంత్ర కథలు లాగానే జంతువుల చేత మాట్లాడించే ప్రక్రియ ఆమె సులువుగా పట్టుకున్నారు. డాక్టరుగా ‘కాకి’ని చక్కగా ఆమెచేత పిల్లల డాక్టర్లు పలికే భాషనే ఎన్నుకున్నారు. డాక్టర్ దగ్గర పని చేసే ‘మైనా’ నర్సు, ఒక్కో రోగినీ పిలవడం, వాళ్లని లోపలికి పంపించడం, పిచ్చుక తన చిన్న పిచ్చుకపాప గురించి అచ్చంగా తమ అమ్మానాన్నలు డాక్టరుగారితో మాట్లాడినట్టుగానే పిచ్చుక పాప ఎగరలేక బిక్కుబిక్కుమంటోందని, తల్లిపిచ్చుక ఆవేదనతో చెప్పడం, అలాగే కుక్కపిల్ల, తేనెటీగ కూడా, వాళ్లవాళ్ల బాధలు డాక్టర్‌గారితో చెప్పే విధానం, చదువుతున్న పిల్లలు వాళ్లనీ, వాళ్ల అమ్మానాన్ననీ, వాళ్ల డాక్టర్నీ ఊహించుకుని, సంతోషంగా చదవడమే కాక, డాక్టర్ కాకి చెప్పే ఆరోగ్య సూత్రాలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చెయ్యకూడదూ అన్నీ పిల్లలకి అర్థమయ్యేలా డాక్టర్ కాకిని, తమ డాక్టరుగానూ, ఆ జంతువులు పక్షులని తమలాగే ఊహించుకుని అందులో లీనమైపోతారు. అంతేకాదు ప్లాస్టిక్‌సంచులని వాడకూడదన్న విషయాన్ని, ఆవుదూడ తువ్వాయి ద్వారా అవి తిని ఎలా జీర్ణం కాక బాధపడిపోయిందో తెలసుకుని వాళ్లు ఆ పని చేయడం మానేసి ఇతరులకు కూడా చేయవద్దని చెప్తారు. అంత బాగా బుజ్జి బుజ్జి మాటలలో మంజులూరి కృష్ణకుమారిగారు ఆ విషయాలను, చిన్నారులు గుర్తుపెట్టుకునేలాగా, చక్కగా రాశారు. ‘పర్యావరణం’ పరిశుభ్రత గురించి కూడా, ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ఫుడ్స్ ఎలా తినకూడదో, కుక్కపిల్ల జూలీ అనుభవంతో పిల్లలు నేర్చుకునేలా రాశారు. అంతేకాదు ఈ విషయాలపై ప్రచారం చాలా అవసరమని, స్వచ్ఛంద సంస్థలు, వ్యవస్థలు ఆ పనిని ఎలా చేయాలో, చిలుకలు, సీతాకోక చిలుకల ద్వారా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఇదొక చక్కటి నవల. పిల్లలని చదివించి అర్థమయ్యేలా చేయడమే కాదు పెద్దలకీ కనువిప్పు కలిగి కార్యోన్ముఖులుగా అయ్యేటట్టు మంచి సూచనలు చేసారు. ఇది చాలా విలువైన పుస్తకం. ప్రతి పాపాయి కొని చదవవలసిన గ్రంథం. పెద్దలు విధిగా ఈ పుస్తకాన్ని పిల్లలకి తప్పక అందేలా చూడాలి. ఇంత మంచి పిల్లల నవల ‘డాక్టర్ కాకి’ రాసిన రచయత్రి అభినందనీయులు. ఇది పిల్లలనీ పెద్దలనీ కూడా ఆలోచింపచేసే నవల.

-శారదా అశోక్ వర్ధన్