బిజినెస్

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ నత్తనడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 2: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో అన్యాక్రాంతమైన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులు చేపట్టిన విచారణ నత్తనడకన సాగుతోంది. ఈ నగరంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. అయితే ఇంతవరకు భూదందాపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నివేదిక ప్రభుత్వానికి పంపకపోవడాన్ని సాక్షాత్తూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే తీవ్రంగా పరిగణిస్తున్నారు. అసలు అధికారుల నివేదిక ఏమైందని, భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకాడుతున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ నగరంలో చాలాకాలంగా భూదందా సాగుతోంది. ఈ అక్రమ భూదందాలో రాజకీయ నాయకుల తోపాటు రెవెన్యూ, నగర పాలక సంస్థ అధికారుల పాత్ర కూడా ఉంది. నగరంలోని రైల్వే, పోర్టు, నగరపాలక సంస్థలకు చెందిన సుమారు 200 ఎకరాలు భూములు అన్యాక్రాంతమయ్యాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ భూముల రికార్డులను తారుమారు చేశారు. చివరకు ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు గజం స్థలం కూడా లేకుండా ప్రభుత్వ భూములను కబ్జాదారులు అన్యాక్రాంతం చేశారు. దీంతో ఈ ల్యాండ్ మాఫియా వెనుక ఎవరున్నారో బహిర్గతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.