కళాంజలి

సాత్వికాభినయానికి అగ్రతాంబూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ సుమిత్ర పార్థసారథి కూచిపూడిలో మేటి కళాకారిణి. గృహిణిగా, పరిశోధకురాలిగా, రచయిత్రిగా, గురువుగా ఎనె్నన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆదర్శ మహిళ. ఎన్నో అవార్డులు పొందినా ఆమె నిండుకుండే. కళాజీవితంలో ఎంతో సాధించినా ఆమె మాట సున్నితం, మనసు నవనీతం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి ‘‘కూచిపూడి నాట్య ఆవిర్భావము: వికాసము, భామాకలాపముపై ప్రత్యేక దృష్టి’’ అనే అంశంలో డాక్టరేట్ పొందారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్, న్యూఢిల్లీ వారి నుండి సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పొందారు. అప్పుడు వారి పరిశోధనాంశం ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అభివఋద్ధి చెందిన నాట్యరీతుల సాంఘిక ప్రయోజనములు పరిశీలన’’. వారితో ముఖాముఖి..
మీ విద్యాభ్యాసం గురించి..
నృత్యానికి చదువు కూడా జత కలిస్తేనే సుగంధ భరితమైన పుష్పంలా ఉంటుంది. మనస్సులో కూడా సంతఋప్తి, సంతోషం ఉంటాయి. నేను 2011లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నఋత్యంలో పి.హెచ్‌డి చేశాను. నా పరిశోధనాంశం- ‘కూచిపూడి నాట్య ఆవిర్భావము: వికాసము, భామాకలాపంపై ఒక ప్రత్యేక దృష్టి’. అప్పుడు నా మార్గదర్శి శ్రీమతి డా. అలేఖ్య పుంజాల. నేను 1998లో యుజిసి నెట్ పరీక్ష పాసయ్యాను. 1994లో ఎం.ఎ. కూచిపూడి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేశాను. 1989లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశాను. హెచ్.ఆర్.డి., మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ న్యూఢిల్లీ నుండి 2012లో నాకు సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ అందింది. అప్పుడు నేను ‘ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందిన నాట్యరీతుల సాంఘిక ప్రయోజనాల పరిశీలన’పై పరిశోధన చేశాను. 1980లో భరతనాట్యంలో సర్ట్ఫికెట్ కోర్సు పాసయ్యాను. 1983లో కూచిపూడిలో సర్ట్ఫికెట్ కోర్సు చేశా.
మీరు చాలా దేశాలు తిరిగారు కదా!?
శ్రీలంకలో ఆర్కియాలజీపై లెక్చర్ ఇచ్చాను. వారి జడ, సత్యభామ జడపై తులనాత్మక పరిశీలన చేశాను. మలేషియా, సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్, అమెరికా వెళ్లాను.
కళాకారిణిగా ఏమైనా అవరోధాలు..?
పెళ్ళికి ముందు బాధ్యతలు తక్కువ. పెళ్ళైన తర్వాత పిల్లలు, వారి చదువులు, కుటుంబపరంగా, సాంఘికంగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. కళాకారిణిగా రాణించాలంటే అవన్నీ అధిగమించాలి. ప్రదర్శనలు తగ్గించి గురువుగా నా కళను అందరికీ పంచి, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దాను. ఎంతోమంది నా శిష్యులు నృత్యంలో సర్ట్ఫికెట్, డిప్లొమా కోర్సులు పాసయ్యారు. పెళ్ళయ్యాక పరిశోధనపై మనసును లగ్నం చేశాను. నా కుటుంబమే నా మొదటి ప్రాధాన్యం.
మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు?
పెళ్ళికి ముందు మా అమ్మానాన్నలు బాగా ప్రోత్సహించారు. పెళ్ళయ్యాక భర్త పార్థసారథి, మామగారు డా. వి.వి.కృష్ణశాస్ర్తీగారు, అలాగే నా గురువు శ్రీ భాగవతుల సీతురాం గారు ఎంతగానో ప్రోత్సహించారు.
మీకు దక్కిన గౌరవాలు, పురస్కారాలు..
ఎన్నో సత్కారాలు, గౌరవాలు పొందాను. అందులో ముఖ్యమైనవి: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి నుండి సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ 2012, నిఘంచిత నాట్య జ్ఞానపీఠం వారు 2016లో ‘నాట్య విద్యాధరి’ బిరుదుతో సత్కరించారు. 1987 మద్రాసులో జ్యూరీ అవార్డు పొందాను. ఇది కళాసాగర్, శివరంజని డ్రామా ఫెస్టివల్‌లో.. 1987లో ఉత్కళ ఆంధ్ర కళాపరిషత్ వారు ‘నాట్య కౌముది’ బిరుదును ఇచ్చారు. 1992లో ‘కూచిపూడి డాన్స్’ను రాసి దర్శకత్వం వహించి నటించాను కూడా. ఇది స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (టెలిస్కూల్) కోసం. అలాగే ఎబిసి హ్యూమరు యుజిసి ప్రోగ్రామ్- దూరదర్శన్‌లో నటించాను. ఎన్నో వ్యాసాలు రాశాను. 2018లో నాకు నాట్య కళాధరి అవార్డు కూడా వచ్చింది. హైదరాబాద్ వై.ఎం.సి.ఎ. వాళ్ళు ఉత్తమ మహిళ అవార్డు కూడా ఇచ్చారు.
నృత్యంపై మీరు ఎన్ని వర్క్‌షాప్స్ చేశారు?
విశాఖపట్నంలో కళాక్షేత్రం కోసం, హైదరాబాద్‌లో సాయినటరాజ అకాడమీ, రవీంద్రభారతిలో, త్యాగరాయ గానసభలో నృత్యంపై వర్క్‌షాప్స్ చేశాను.
మీ అభిరుచులేంటి?
సంఘసేవ చేస్తుంటాను. మొక్కలు నాటడం, నేత్ర చికిత్సా శిబిరం, కుటుంబ నియంత్రణ శిబిరం, వరద బాధితులకు సహాయం మొదలైనవి. స్కూలు, కాలేజీల్లో చెస్, రన్నింగ్, త్రోబాల్, రింగ్ టెన్నిస్ ఆడేదాన్ని. సైదాబాద్ స్ర్తి శక్తి లేడీస్ క్లబ్ ప్రెసిడెంటును నేను.
ఎవరి వద్ద మీరు నృత్యం నేర్చుకున్నారు?
నేను బి. రామ్మోహన్‌రావుగారి వద్ద భరతనాట్యం నేర్చుకున్నాను. కూచిపూడిలో సర్ట్ఫికెట్, డిప్లొమా పసుమర్తి సీతారామయ్యగారి వద్ద చేశాను. యక్షగానాలు పసుమర్తి కేశవప్రసాద్, పసుమర్తి వెంకటేశ్వర్లు, కె.వి. సత్యనారాయణ గారి వద్ద నేర్చుకున్నాను. నా పి. హెచ్‌డి మార్గదర్శి శ్రీమతి డా. అలేఖ్య పుంజాల.
మీరు ఎలా అభ్యాసం చేసేవారు?
పెళ్ళికి ముందు రోజూ పొద్దునే్న రెండు గంటల సేపు నృత్యం అభ్యాసం చేసేదాన్ని. పెళ్ళయ్యాక సాయంత్రం రోజూ రెండు గంటలు నాకు ‘మైత్రేయి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ అనే నాట్య శిక్షణాలయం ఉంది. అక్కడే నేను ఎంతోమంది కళాకారిణులను తీర్చిదిద్దుతున్నాను. నృత్యంతో పాటు భగవద్గీత శ్లోకాలు, మానసిక వికాసం వంటివి నేర్పుతాను.
టీవీతో మీకున్న అనుబంధం..?
ఈటీవీ 2, అభిరుచి, ఈటీవీ, టీవీ 9 మొదలగు ఛానల్స్‌లో పనిచేశాను. వంటలు, మన సంస్కృతి, సంప్రదాయం మొదలైన అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేశాను. నన్ను ‘సఖి’ ప్రోగ్రామ్‌లో దాదాపు ఎనిమిది సంవత్సరాలు ప్రేక్షకులు చూశారు. ‘స్వీట్‌హోమ్’లో కూడా దాదాపు మూడు సంవత్సరాలు కనిపించాను.
మీ వ్యాసాల గురించి..?
‘సైకాలజీ టుడే’లో ఎన్నో వ్యాసాలు ప్రచురించాను. ఎన్నో సెమినార్లలో పేపర్ ప్రెజెంటేషన్ చేశాను. ప్రఖ్యాతమైన మ్యాగజైన్లు, సావనీర్లలో నృత్యంపై వ్యాసాలు రాశాను.
ఎన్ని సంవత్సరాలుగా నృత్యం నేర్పిస్తున్నారు?
సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కూచిపూడి నృత్య విభాగంలో ప్రొఫెసర్‌ని. నాకు ఓ ప్రైవేటు శిక్షణాలయం ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి యక్షగానంపై ఎన్నో గెస్ట్ లెక్చర్స్ ఇచ్చాను. చాలా స్కూళ్ళలో పనిచేశాను.
మీరిచ్చే సందేశం ఏంటి?
కేవలం యాంత్రికంగా ఆంగికం మాత్రమే చేస్తే నృత్యం రక్తి కట్టదు. సాహిత్యం అర్థం చేసుకుని ప్రేక్షకులకు అందించాలి. సాత్వికాభినయానికే పెద్దపీట వేయాలి. ఎక్కడపడితే అక్కడ కాకుండా గౌరవంగా నాట్యాన్ని ప్రదర్శించాలి. నేను అవార్డులు, రివార్డుల కోసం ఎప్పుడూ నాట్యం చేయలేదు. నా కళ భగవంతుని కోసం, నా మానసిక ఆనందం, సంతోషం కోసం.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి